ETV Bharat / entertainment

నాగ చైతన్య 'తండేల్​' గ్రాండ్ లాంఛ్​ - స్పెషల్ అట్రాక్షన్​గా సాయి పల్లవి! - tandel movie latest updates

Thandel Muhurtham Ceremony : అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి లీడ్​ రోల్స్​లో తెరకెక్కుతున్న చిత్రం 'తండేల్​'. ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమంతో గ్రాండ్​గా ప్రారంభమైంది.

Thandel Muhurtham Ceremony
Thandel Muhurtham Ceremony
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 12:22 PM IST

Updated : Dec 9, 2023, 1:27 PM IST

Thandel Muhurtham Ceremony : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి లీడ్​ రోల్స్​లో నటిస్తున్న చిత్రం 'తండేల్​'. మత్స్యకారుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమంతో గ్రాండ్​గా ప్రారంభమైంది. హైదరాబార్​లోని అన్నపూర్ణ స్టూడియోస్​ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి నాగార్జున, వెంకటేశ్​, సాయి పల్లవి, అల్లు అరవింద్​తో పాటు మూవీ టీమ్ హాజరైంది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మరోవైపు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సాయి పల్లవి దాదాపు రెండేళ్ల గ్యాప్​ తర్వాత మూవీస్​లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో 'లవ్ స్టోరీ' సినిమాలో చైతూ సరసన నటించింది. ఆ మూవీ మంచి టాక్ అందుకుని బాక్సాఫీస్​ వద్ద వసూళ్లు కూడా అందుకుంది. ఆ తర్వాత తండేల్​లో మరోసారి ఈ జంట స్క్రీన్​ షేర్ చేసుకోనుంది.

Thandel Movie Story : ఇక మూవీ విషయానికి వస్తే.. బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని 'వీరవల్‌'కు వెళ్లి సముద్రవేట చేస్తున్న కొందరు మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్టు గార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు.. కష్టాల గురించి ఈ సినిమాలో చూపించనున్నట్లు మేకర్స్​ ఇటీవలే వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీ కాకులానికి వెళ్లిన చిత్ర బృందం అక్కడున్న మత్స్యకారులను పలకరించి..వాళ్ల అలవాట్ల గురించి తెలుసుకున్నారు.

Thandel Movie Cast : యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న‌ ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్స్ నిర్మిస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నర్​ టాలీవుడ్ మ్యూజిక్​ డైరెక్టర్​ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

మరోవైపు అయితే ఈ మూవీ కోసం నాగ చైతన్య తనని తాను మార్చుకున్నారు. ఫిట్​నెస్​ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గడ్డం, జుట్టు పెంచి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఈ క్రమంలో నవంబర్​ 23న చైతూ బర్త్​డే స్పెషల్​గా విడుదలైన ఓ పోస్టర్​ ద్వారా 'తండేల్' మూవీ టైటిల్​ను అనౌన్స్ చేశారు. అలా చైతూ లుక్​ను కూడా రివీల్ చేశారు.

నాగ చైతన్య కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ - ఆ క్రేజీ లుక్​లో పోస్టర్ రివీల్​!​

'తండేల్'​ టు 'తంగలాన్' ​- టైటిల్స్​లో కొత్త ట్రెండ్​ - వీటికి అర్థాలు తెలుసా ?

Last Updated : Dec 9, 2023, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.