ETV Bharat / entertainment

ఖా'కీ' రోల్స్​తో కథానాయకులు.. ప్రేక్షకులకు ఫుల్​ కిక్కు! - pawan kalyan news

Telugu Heros on Police Roles: మాస్‌ పాత్రలతో సీటీ కొట్టించినా.. చారిత్రక యోధుడిగా వీరత్వం చూపించినా.. ఫ్యాక్షన్‌ హీరోగా మీసం మెలేసినా.. ఖాకీ చొక్కా తొడిగి నాలుగో సింహంలా నడిచొస్తే చాలు.. 'ఆ కిక్కే వేరప్పా' అని మురిసిపోతుంది ప్రేక్షకలోకం. పోలీస్‌ కథలకు సినీప్రియుల్లో ఉన్న క్రేజ్‌ అలాంటిది. అందుకే మంచి కథ దొరికినప్పుడల్లా యూనీఫాం తొడుక్కొని హీరోయిజం ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు తెలుగు కథానాయకులు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పోలీస్‌ కథల జోరు కనిపిస్తోంది. పలువురు అగ్ర హీరోలతో పాటు కొందరు కుర్ర హీరోలు ఖాకీ చొక్కా తొడిగి బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతున్నారు.

Telugu Heros on Police Roles
ఖా'కీ' రోల్స్​తో వస్తున్న కథానాయకులు..
author img

By

Published : Apr 1, 2022, 6:58 AM IST

Telugu Heros on Police Roles: "హీరోయిజం ఒక్కో చిత్రంలో ఒక్కో తరహాలో కనిపిస్తుంటుంది. అసలు సిసలు నిఖార్సైన హీరోయిజం మాత్రం పోలీస్‌ పాత్రల్లోనే దాగి ఉంటుంది." అంటుంటారు సినీ విశ్లేషకులు. అందుకే తమ అభిమాన కథానాయకులు ఖాకీ చొక్కాలో దర్శనమిస్తే చాలు.. పూనకాలతో ఊగిపోతుంటుంది ప్రేక్షకలోకం. ఈ కారణంగానే అవకాశం దొరికినప్పుడల్లా పోలీస్‌ కథల్లో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తుంటారు మన కథానాయకులు. 'గబ్బర్‌ సింగ్‌', 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' చిత్రాల్లో ఖాకీ తొడిగి, తన లాఠీ పవర్‌ రుచి చూపించారు పవన్‌ కల్యాణ్‌. ఆయన ఇటీవలే 'భీమ్లానాయక్‌'తో ముచ్చటగా మూడోసారి పోలీస్‌గా కనిపించి.. మురిపించారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం కథానాయకుడు రామ్‌చరణ్‌తోనూ పోలీస్‌ చొక్కా తొడిగించారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది.

Prabhas News: ఇటు ప్రేమ కథలతోనూ.. అటు యాక్షన్‌ కథాంశాలతోనూ సత్తా చాటారు కథా నాయకుడు ప్రభాస్‌. ఆయన ఇప్పటి వరకు పోలీస్‌ పాత్రలో కనిపించింది లేదు. ఇప్పుడా లోటును 'స్పిరిట్‌'తో భర్తీ చేయనున్నారాయన. సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించనున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు ప్రభాస్‌.

Hero Ram News: ఇప్పుడీయన బాటలోనే పోలీస్‌గా వెండితెరపై హీరోయిజం ప్రదర్శించేందుకు ఊవ్విళ్లూరుతున్నారు హీరో రామ్‌ పోతినేని. లింగుస్వామి దర్శకత్వంలో ఆయన చేస్తున్న కొత్త చిత్రం 'ది వారియర్‌'. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ ద్విభాషా చిత్రంలో శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా సందడి చేయనున్నారు రామ్‌. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

sudheer babu news
సుధీర్​ బాబు

ఖాకీ కుర్రాళ్లు: ప్రస్తుతం వెండితెరపై యూనీఫాంతో సందడి చేయనున్న వారిలో యువ కథానాయకులే ఎక్కువ ఉన్నారు. 'వీరభోగ వసంతరాయలు', 'వి' సినిమాల్లో ఖాకీ దుస్తుల్లో కనిపించి అలరించారు హీరో సుధీర్‌బాబు. ఇప్పుడాయన ముచ్చటగా మూడోసారి అలాంటి పాత్రతో హీరోయిజం చూపించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన హీరోగా మహేష్‌ ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. దీన్ని భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకొంటోంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో సుధీర్‌ ఓ శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు.

Aadavi Shesh News
అడవి శేష్​

Aadavi Shesh News: విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశాలు ఎంచుకుంటూ.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు యువ హీరో అడివి శేష్‌. ప్రస్తుతం 'మేజర్‌' కోసం ఎన్‌ఎస్‌జి కమాండర్‌గా మారిన ఆయన.. ఇప్పుడు 'హిట్‌ 2' కోసం పోలీస్‌ అవతారమెత్తారు. శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. 'హిట్‌'కు కొనసాగింపుగా రూపొందుతోంది. ఇందులో కృష్ణ దేవ్‌ అనే శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా తన ఖాకీ పవర్‌ రుచి చూపించనున్నారు అడివి శేష్‌. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hero Sri Vishnu News
శ్రీ విష్ణు

Hero Sri Vishnu News: వైవిధ్యభరితమైన కథలకు చిరునామాగా నిలిచే హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం ఆయన ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. దీన్ని లక్కీ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఇందులో విష్ణు ఖాకీ చొక్కాలో సందడి చేయనున్నారు. ఇండియాలోని కొందరు బెస్ట్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ ఎపిసోడ్స్‌ తీసుకొని ఫిక్షనల్‌ బయోపిక్‌లా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Aadi Sai Kumar New
ఆది సాయికుమార్​

Aadi Sai Kumar News: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు ఆది సాయికుమార్‌. ప్రస్తుతం ఆయన 'సిఎస్‌ఐ సనాతన్‌', 'అమరన్‌ ఇన్‌ ది సిటి', 'బ్లాక్‌' చిత్రాలతో సెట్స్‌పై ముస్తాబవుతున్నారు. ఈ మూడు సినిమాల్లోనూ ఆయన పోలీస్‌గా సందడి చేస్తుండటం విశేషం. ఈ మూడు చిత్రాలు ఈ ఏడాదిలోనే సినీప్రియుల ముందుకు రానున్నాయి.

ఇదీ చదవండి: రాజమౌళిపై కంగన కామెంట్స్... వాటివల్లే సక్సెస్ అయ్యారంటూ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.