ETV Bharat / entertainment

'కంగువ'.. సూర్యకి 'బాహుబలి' లాంటి సినిమా అవుతుందా? - కంగువా మూవీ లేటెస్ట్ పోస్టర్​

Suriya Kanguva Glimpse : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'కంగువా' మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఇందులోని కొన్ని ప్రధాన అంశాలు ఆడియెన్స్​కు ఈ సినిమాపై భారీ అంచనాలు తెప్పించేలా ఉన్నాయి. అవేంటంటే..

suriya kanguva movie
suriya kanguva movie
author img

By

Published : Jul 23, 2023, 7:27 PM IST

Suriya Kanguva First Glimpse : తమిళ స్టార్​ హీరో సూర్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన 'కంగువా' గ్లింప్స్ తాజాగా ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇటీవలే 'విక్రమ్' సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్​లో కనిపించి నట విశ్వరూపాన్ని చూపించిన సూర్య.. ఇప్పుడు 'కంగువా'తో అంతకు మించి చేసేలా కనిపిస్తున్నారు. తమిళ దర్శకుడు శివ రూపొందిస్తున్న ఈ మూవీ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనుంది. అయితే ఇది కాస్త రియలిస్టిక్, మరికొంత ఫిక్షనల్​గా ఉన్నట్లు సమాచారం. ఇక ఇందులో ఆటవిక జాతికి నాయకుడు 'కంగువా'గా సూర్యను చూపించిన విధానం కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ క్రమంలో అసలు తాజాగా విడుదలైన గ్లింప్స్​లో ఏముందంటే..

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి దర్శకుడు శివ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. తమిళంలో కంగు అంటే అగ్ని అని.. 'కంగువ' అంటే అగ్నిని ధరించిన వ్యక్తి అని అంటారట. అంటే ఈ సినిమాలో సూర్య ఎక్కువగా అగ్ని ధరించి యుద్ధాలు చేస్తుంటారని సమాచారం. అయితే ఇది పురాణాలకు సంబంధించిన కథ కాదని దర్శకుడు తెలిపారు. కానీ చరిత్రలోని కొన్ని అంశాలను పునాదిగా తీసుకుని దానికి కల్పిత కథను జోడించి ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. 14వ శతాబ్దం బ్యాక్ డ్రాప్‌లో సాగనున్న ఈ సినిమా ఆటవిక నేపథ్యంలో ఎక్కువగా కనిపించనుందట.

శతాబ్దాల వెనుక అరాచకం రాజ్యమేలుతున్న సమయంలో శరణు కోరిన వాళ్ళను ఆదుకోవడానికి వచ్చిన కంగువా అన్యాయం చేసిన వాళ్ళ తలలు నరికే బాధ్యతను తీసుకుంటాడు. కుశలమా అంటూనే క్రూరత్వాన్ని, స్నేహాన్ని కళ్ళతో పలికించి వణికిస్తాడు. అలా సూర్య క్యారెక్టర్​ చాలా డిఫరెంట్​గా రూపొందించారు దర్శకుడు. ఇక ఈ సినిమా విజువల్స్ పరంగానూ చాలా ఆకట్టుకుంది. దాదాపు రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న వీడియోలో ఉన్న ఎలిమెంట్స్​ అన్నీ ట్రైలర్ కోసం కావలిసిన హైప్​ని క్రియేట్​ చేసేలా ఉన్నాయి. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ట్రైలర్​ రానుందా అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక ఈ సినిమాకు టాలీవుడ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇక ఆయన థీమ్ నుంచి సూర్య ఎంట్రీ వరకు అన్నింటిని తన మ్యూజిక్​తో సూపర్​గా ఎలివేట్ చేశారు. శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి మొత్తం పది భాషల్లో రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ కూడా మల్టీ ఆడియో ఆప్షన్లు పెట్టారు. ఇక ఈ సినిమాకు త్రీడి వెర్షన్ సిద్ధం చేయనున్నారట. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జ్ఞానవేల్ రాజా నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఇవన్ని చూస్తుంటే ఓ రకంగా సూర్యకి ఇది 'బాహుబలి' లాంటి సినిమా అయ్యేలా ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ రేంజ్‌ సినిమా కావాలని కోరుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.