ETV Bharat / entertainment

జమున బయోపిక్​లో తమన్నా.. నిజమేనా? - టాలివుడ్ తాజా వార్తలు

సీనియర్​ నటి జమున శుక్రవారం తుదిశ్వాస విడవడంతో ఆమె బయోపిక్​ గురించి చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

tamannah bhatia in actress jamuna biopic
నటి జమునా బయోపిక్​లో తమన్నా
author img

By

Published : Jan 28, 2023, 12:20 PM IST

ఇటీవలే అందాల చందమామ నటీ జమున భువిని వీడి దివికి వెళ్లారు. సినీ చరిత్రలో ఆమెకు గొప్ప స్థానం ఉంది. కళ్లతోనే నటించే ఆమెకు ప్రేక్షక అభిమానం ఎంతగానో ఉంది. గొప్ప స్టార్స్​తో కలిసి నటించిన ఈమె శుక్రవారం మనల్ని వీడి వెళ్లిపోయారు. అయితే చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించిన నటీమణులందరి బయోపిక్​లు తీయడం ప్రస్తుతం ట్రెండ్​గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జమున కన్నుమూయడంతో ఆమె బయోపిక్ మూవీ గురించి చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో మిల్క్ బ్యూటీ తమన్నాను తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే దీనికై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కూడా నటి జమున బయోపిక్​లో తమన్నా నటించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగింది. ఈ సినిమా కోసం దర్శకుడు శివనాగు ఇప్పటికే స్క్రిప్ట్​ వర్క్​ను సిద్ధం చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇకపోతే ఇంతవరకు తెరకెక్కించిన నటీమణుల జీవిత చరిత్రలు ఎంతో విజయాన్ని సాధించాయి. అలనాటి నటి మహానటి సావిత్రి బయోపిక్​లో కీర్తిసురేశ్ నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రేక్షకులు ఎంతో దగ్గరవడంతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది.

మహానటి సావిత్రి జీవిత చరిత్రే కాదు రాజకీయంగా, నటన పరంగా అందరినీ ఆకట్టుకుని తనకంటూ ఒక స్టార్​డమ్​ను సాధించుకున్నారు జయలలిత. ఈమె బయోపిక్​ 'తలైవి'లో కంగనా రనౌత్ నటించారు. ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇలా ఎంతో మంది తారల బయోపిక్​లో వెండితరపై మెరిసి విజయాల్ని సాధించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.