ETV Bharat / entertainment

Tamannaah Dance : అభిమానితో కలిసి స్టెప్పులేసిన తమన్నా.. వీడియో వైరల్ - జైలర్​ కొత్త సాంగ్​

Tamannaah Dance Airport : సూపర్​స్టార్​ రజనీకాంత్​, హీరోయిన్​ తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జైలర్​'. ఈ సినిమాలోని ఓ ఫేమస్​ పాటకు తన అభిమానితో కలిసి ఎయిర్​పోర్టులో స్టెప్పులు వేశారు మిల్కీబ్యూటీ తమన్నా. ఆ డ్యాన్స్​ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Tamannaah Bhatia Dance With Fan In Airport
'నాకంటే బాగా చేస్తున్నాడుగా'.. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్​తో తమన్నా స్టెప్పులు.. వీడియో వైరల్​..
author img

By

Published : Jul 11, 2023, 6:49 PM IST

Tamannaah Dance In Airport : టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ తమన్నా భాటియా మరోసారి తన అభిమానితో కలిసి ఎయిర్​పోర్టులో సందడి చేశారు. ఇటీవలే ఓ వీరాభిమాని తన ఫొటోను చేతిపై పచ్చబొట్టు వేయించుకోవడం చూసిన ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈసారి మాత్రం ఓ ఫ్యాన్​తో కలిసి స్టెప్పులేశారు. అది కూడా తాను నటించిన తాజా చిత్రం 'జైలర్'​లోని 'వా నువు కావాలయ్యా' అనే పాట​కు అభిమాని కోరిక మేరకు డ్యాన్స్​ చేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్​ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడూ తన అభిమానులతో టచ్​లో ఉంటారు. కేవలం సోషల్​ మీడియాలోనే కాకుండా తన ఫ్యాన్స్​ ఎక్కడా కనిపించినా వారితో కలిసి కాసేపు ముచ్చటిస్తారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తారు కూడా. ఇది ఆమెలోని స్పెషాలిటీ అంటుంటారు ఫ్యాన్స్​.

Tamannaah New Movie : ఇదిలా ఉంటే.. సూపర్​స్టార్ రజనీకాంత్​, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం 'జైలర్​'. ఈ సినిమాలోని 'వా నువు కావాలయ్యా' పాట లిరికల్ వీడియోను ఇటీవలే విడుదల చేసింది మూవీ యూనిట్​. అందులో తమన్నా తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. సోషల్‌మీడియాలోనూ ఈ పాట తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో ఆమె కనిపించిన సమయంలో ఫ్యాన్స్ ఆ పాటలోని స్టెప్స్‌ను వేయాలని కోరుతున్నారు. తాజాగా ముంబయి ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని కూడా అలాగే తనతో కలిసి ఈ పాటకు డ్యాన్స్‌ వేయాలని అడిగాడు. దీనికి తమన్నా అంగీకరించడం వల్ల ఇద్దరూ కలిసి ఎయిర్​పోర్టు బయటే ఆ పాటకు అదిరిపోయే స్టెప్స్‌ వేశారు. అయితే తన కంటే ఆ అభిమానే డ్యాన్స్‌ బాగా వేశారని తమన్నా మెచ్చుకోవడం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రియుడిపై మండిపాటు..
మరోవైపు ఈ లిరికల్‌ వీడియోలో తమన్నా చేసిన డ్యాన్స్‌పై ఆమె ప్రియుడు విజయ్‌ వర్మ ఇటీవలే స్పందించారు. తన ఇన్‌స్టా వేదికగా ఆ పాటలో ఆమె డ్యాన్స్‌ వీడియోను షేర్‌ చేసిన విజయ్‌ వర్మ.. పాట అద్భుతంగా ఉందంటూ పొగడ్తలు కురిపించారు. అలాగే సినిమాకు రజనీకాంత్ దేవుడైతే.. దేవత తమన్నా అని రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు నెటిజన్లు విజయ్‌ వర్మ అభిప్రాయాన్ని తప్పుబడుతున్నారు. 'తమన్నా కంటే గొప్ప నటులు, డ్యాన్సర్లు చాలామందే ఇండస్ట్రీలో ఉన్నారు' అంటూ నెగెటివ్​ కామెంట్స్‌ పెడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.