ETV Bharat / entertainment

Jailer Twitter Review : రజనీ 'జైలర్​' ఎలా ఉందంటే ? - జైలర్ ట్విట్టర్​ రివ్యూ​

Jailer Twitter Review : సూపర్​ స్టార్​ రజనీకాంత్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'జైలర్' మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజైంది. ఇప్పటికే ప్రీమియర్​ షోస్​ చూసిన ఫ్యాన్స్​ ట్విట్టర్​ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే..

Jailer Twitter Review
Jailer Twitter Review
author img

By

Published : Aug 10, 2023, 7:06 AM IST

Updated : Aug 10, 2023, 8:57 AM IST

Jailer Twitter Review : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'జైలర్'. రమ్యకృష్ణ, శివరాజ్​ కుమార్, మోహన్​లాల్​ లాంటి స్టార్స్​ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకత్వం వహించారు. యాక్షన్​ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమా గురువారం థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైంది. ఫస్ట్ లుక్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ ఇలా అన్ని అంశాలు ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే ప్రీమియర్​ షోస్​ చూసిన ఫ్యాన్స్​ ట్విట్టర్​ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే..

Jailer Audience Review : ఈ సినిమా ఫుల్​ కామెడీ ఎంటర్​టైనర్​గా ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో యోగిబాబు, రజనీ కాంబోలో వచ్చే సీన్స్​ను చూసి అందరూ కడుపుబ్బా నవ్వుతారని కొందరు అభిప్రాయపడగా.. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్​లో రజనీ ఫుల్​ ఆన్​ యాక్షన్ మోడ్​లో ఇరగదీశారని మరికొందరు అంటున్నారు. ఇక సెకండ్​ హాఫ్‌లో మాత్రం కొందరు స్పెషల్ ఎంట్రీల వల్ల సినిమాకు మరిన్ని మాస్ ఎలిమెంట్స్ యాడ్​ అయ్యాయని.. క్లైమాక్స్‌లో అసలు ట్విస్ట్​ ఉందని మరో అభిమాని ట్వీట్​ చేశారు. మొత్తానికి 'జైలర్' నిరాశపరచదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ఇక ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్​ ట్రీట్​ అని.. పలు సీన్స్​ ఆడియెన్స్​కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని మరో ఫ్యాన్​​ నెట్టింట రాసుకొచ్చారు. ఇక అభిమానులకు నెల్సన్ మంచి సినిమా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మరో యూజర్​ కామెంట్ చేశారు.

Jailer Movie Fans Celebration : సాధారణంగా రజనీ సినిమా రిలీజైంది అంటే ఇక ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. యావత్​ సౌత్ అంతా ఆయన సినిమా రిలీజ్​ను ఓ పండగలా చేసుకుంటుంటారు. ఇప్పటికే వరల్డ్​వైడ్​ ఉన్న రజనీ ఫ్యాన్స్​ అంతా థియేటర్లకు వెళ్లి సందడి చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు థియేటర్లలో బాణాసంచ పేలుస్తూ డ్యాన్సులు వేస్తున్నారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్​లు సైతం పెట్టారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరులోని పలు కంపెనీలు జైలర్​ రిలీజ్​ సందర్భంగా తమ సంస్థలకు సెలవులు ప్రకటించడమే కాకుండా తమ ఉద్యోగస్థులకు ఫ్రీగా టిక్కెట్లు సైతం పంపిణీ చేశాయి.

Jailer Overseas Booking : ఓవర్సీస్​లో 'జైలర్' సినిమా​ ఓ రికార్డు దశగా దూసుకెళ్తోందట. యూఎస్​ఏలో ప్రీమియర్స్​కు భారీగా స్పందన లభిస్తోందని తెలిసింది. ఇప్పటికే $800K దాటేసిందని సమాచారం. 1 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకెళ్తోందట. ఒకవేళ ఈ చిత్రం 1 మిలియన్ డాలర్స్ మార్క్​ను అందుకుంటే.. ఈ ఏడాది అమెరికా బాక్సాఫీస్ ముందు ఫస్ట్ మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న తొలి ఇండియన్ ఫిల్మ్‌గా 'జైలర్' నిలుస్తుంది.

రజనీ స్ఫూర్తితోనే చిరు సెకెండ్​ ఇన్నింగ్స్​.. 24 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్‌ వద్ద 'ఢీ'.. ఇద్దరూ తమన్నాతోనే..

'జైలర్‌' రిలీజ్‌.. చెన్నై, బెంగళూరు ఆఫీస్​లకు హాలీడే.. ఫ్రీగా టికెట్లు.. ఇది కదా రజనీ క్రేజ్‌ అంటే!

Last Updated : Aug 10, 2023, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.