Sridevi 60th Birth Anniversary : దివంగత నటి శ్రీదేవి 60వ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళి అర్పించింది గూగుల్ సంస్థ. ఈ క్రమంలో ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. తమ డూడుల్‌గా ఆమె ఫొటోను ఉంచి గౌరవించింది. శ్రీదేవి మరణించిన ఐదేళ్ల అయినప్పటికీ.. ఆమెకు ఇలాంటి గౌరవం దక్కడం వల్ల శ్రీ దేవి ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ డూడుల్ పిక్చర్‌ను.. ముంబయికి చెందిన ప్రముఖ యానిమేటర్ డిజైనర్ 'భూమికా ముఖర్జీ' రూపొందించారు.
Sridevi Film Career : 13 ఆగస్టు 1963లో తమిళనాడులో జన్మించారు శ్రీదేవి. అయితే ఆమె అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్. శ్రీదేవిగా పేరు మార్చుకున్న ఆమె ఇండస్ట్రీలో నాలుగు దశబ్దాల పాటు ఓ వెలుగు వెలిగారు. చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 250+ సినిమాల్లో నటించారు. తన నటనకు గాను పలు భాషల్లో ఎన్నో అవార్డులు పొందారు శ్రీదేవి. 'పదహారేళ్ల వయసు' సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ఆమె.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. అతిలోక సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 1996లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కాగా ఈ దంపతులకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Sridevi Padma Shri Award : చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి 2012లో కమ్‌బ్యాక్ ఇచ్చారు. 'ఇంగ్లిష్ వింగ్లిష్' అనే బాలీవుడ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2013లో అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 'పద్మ శ్రీ' అవార్డు కూడా అందుకున్నారు. 54 ఏళ్ల వయసులో 2018లో శ్రీదేవి ప్రమాదవశత్తు దుబాయ్‌లో మరణించారు. ఆమె మరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Janhvi Kapoor Film Career : ప్రస్తుతం శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. 2018లో 'దఢక్' అనే బాలీవుడ్ మూవీతో తెరంగేట్రం చేసిన జాన్వీ.. బీ టౌన్లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు.
అతిలోక సుందరి శ్రీ దేవి దివికేగి ఐదేళ్లు.. ఆమె చివరి తెలుగు సినిమా ఏంటో తెలుసా?
'జురాసిక్ పార్క్' మూవీని రిజెక్ట్ చేసిన శ్రీదేవి.. ఎందుకంటే?