ETV Bharat / entertainment

Sree Leela VD 12 : విజయ్​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​.. ఆ జంట ముచ్చటగా మూడోసారి! - రష్మిక విజయ్ దేవరకొండ సినిమాలు

Sree Leela VD 12 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ -గౌతం తిన్నూరి కాంబోలో వస్తున్న 'VD 12' సినిమాలో యంగ్​ బ్యూటీ శ్రీలీల నటిస్తున్న సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని తెలుస్తోంది. ఆమె ప్లేస్​లో ఓ స్టార్​ హీరోయిన్​ను తీసుకోనున్నారంట. ఇంతకీ ఆమె ఎవరంటే ?

ESree Leela VD 12
Sree Leela VD 12
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 10:30 AM IST

Updated : Sep 26, 2023, 11:11 AM IST

Sree Leela VD 12 : శ్రీలీల.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ హీరోయిన్ గురించే టాపిక్​. ఇండస్ట్రీలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే స్టార్​డం తెచ్చుకున్న ఈ చిన్నది.. అనతికాలంలోనే అగ్రతారలతో స్క్రీన్​ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగింది. అలా ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది. రామ్‌ పోతినేని, 'స్కంద' బాలకృష్ణతో 'భగవంత్ కేసరి', ఆ తర్వాత వైష్ణవ్ తేజ్‌తో 'ఆదికేశవ్', నితిన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఇలా వరుసగా తన సినిమాలు రిలీజ్​కు రెడీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్​తో 'ఉస్తాద్ భగత్ సింగ్', మహేశ్ బాబుతో 'గుంటూరు కారం' కూడా లైనప్​లో ఉంది.

VD 12 Cast : అయితే గతంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'VD 12' అనే చిత్రంలో శ్రీలీల నటిస్తుందని అప్పట్లో అఫీషియల్ అనౌన్స్​మెంట్​ కూడా జరిగింది. దీనికి సంబంధించిన పూజ కార్యక్రమానికి కూడా శ్రీలీల హాజరైంది. అయితే ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకోనుందట. తన కాల్షీట్​లో డేట్స్​ అడ్జస్ట్ కాకపోవడం వల్ల శ్రీ లీల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తాజా సమాచారం. దీంతో ఆమె స్థానంలో నేషనల్​ క్రష్ రష్మిక ఈ సినిమాలో విజయ్​ సరసన నటించనుందని టాక్​. అయితే ఈ విషయంపై ఎటువంటి అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ రాలేదు. అయినప్పటికీ ఈ రూమర్​ విన్న ఫ్యాన్స్​ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. తమ ఫేవరట్​ కపుల్​ను స్క్రీన్​పై ముచ్చటగా మూడోసారి చూడొచ్చని సంబరపడుతున్నారు. ఈ వార్త నిజమైతే బాగున్ను అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Vijay Rashmika Movies : ఇక విజయ్​-రష్మిక మందన్న కలిసి 'గీతా గోవిందం', 'డియర్​ కామ్రేడ్​' సినిమాల్లో నటించారు. ఆన్‌స్క్రీన్‌ లవ్లీ పెయిర్‌గా ట్రెండ్​ సృష్టించిన ఈ స్టార్స్​ ఆఫ్​స్క్రీన్​లోనూ మంచి ఫ్రెండ్​గానూ కొనసాగుతున్నారు. అయితే గతకొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు వార్తలు నెట్టింట హల్​చల్​ చేశాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని.. తాము మంచి స్నేహితులం మాత్రమేనని గతంలో ఈ జంట సమాధానమిచ్చింది. అయినప్పటికీ వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలిసి తిరిగిన సందర్భాలున్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా​ ఈ జంట త్వరలో తమ లవ్​ గురించి చెప్తే బాగున్ను అంటూ ఆశిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Prabhas Sreeleela Movie : ప్రభాస్ సరసన శ్రీలీల!.. దర్శకుడు అతడే.. సినిమా ఎప్పుడు ప్రారంభం అంటే?

Rashmika Mandanna Latest Instagram Post : విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక​.. స్పెషల్​ ఏంటో?

Last Updated : Sep 26, 2023, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.