singer chithra songs : సంగీత ప్రపంచంలో ఆమె ఓ స్వర శిఖరం. శ్రోతల హృదయాల్లో ఆమె పాటలు ఎప్పటికీ పదిలం. ఏ పాట పాడినా.. ఏ భావం పలికిన.. స్పష్టమైన ఉచ్ఛారణ ఆమె వరం. తనకున్న గాత్ర నైపుణ్యంతో ఎంతో మంది దిగ్గజ సింగర్స్‌తో గొంతు కలిపిన ఆమె.. అనేక భాషల్లో దాదాపు 25వేలకు పైగా పాటలు పాడారు. అలా సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్‌లోనూ తన సాంగ్స్‌తో ఎందరో సంగీత ప్రియుల ఆదరాభిమానాలను పొందారు. ఆమె మరెవరో కాదు లివింగ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ కె.ఎస్.చిత్ర. ఎక్కడో కేరళలో పుట్టిన ఆమె.. యావత్ సినీ ప్రపంచాన్ని తన గాత్రంతో ఓలలాడించి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. భయానకం, కరుణ, వీరత్వం, హాస్యం.. ఇలా సన్నివేశం ఏదైనా సరే దానికి ఆమె గళం తోడైతే ఇక ఆ పాట ఓ అద్భుతం అనాల్సిందే. సంగీతానికి భాషతో సంబంధం లేదన్న విషయాన్ని నిరూపించిన ఆమె.. తన గాత్రంతో పాటలకు నవరసాలను పరిచయం చేశారు. 'పాడలేను పల్లవైనా భాషరాని దానను'అని అంటూనే తన మాతృభాష మలయాళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ పాటలను ఆలపించారు. అంతే కాకుండా తమిళం, ఒరియా, హిందీ, కన్నడ, బెంగాలీ, తుళు భాషల్లోనూ ఆమె పాడారు. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. నేడు(జూలై 27) ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చిన్నప్పటి నుంచే సింగర్ అవ్వాలని మీరు అనుకున్నారా?
చిత్ర : అవును చిన్నప్పటి నుంచి నాకు ఆసక్తి ఉన్న ఏకైక విషయం సింగింగ్. నేను కాలేజీలో కూడా మ్యూజిక్‌నే మెయిన్ కోర్స్‌గా తీసుకున్నాను. ఎంఏ కోర్స్ జాయిన్ అయిన సమయంలోనే నేను 'సింధు భైరవి' సినిమాకు రికార్డింగ్ చేశాను. అందుకే ఆ కోర్స్ సగంలో ఆపేశాను. నా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. నేను కూడా వారి లాగే టీచర్ అవ్వాలనుకున్నాను. ఒకవేళ నా కోర్స్ కంప్లీట్ చేసుంటే బహుశా నేను కూడా ఏదో ఒక మ్యూజిక్ స్కూల్లో టీచర్‌గా పని చేసుంటానేమో.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
singer chitra journey :మీ మ్యూజికల్ జర్నీ గురించి చెప్పండి?
చిత్ర : నేను తొలుత మలయాళం సినిమాల్లో పాడటం ప్రారంభించాను. 1979లో నా ఫస్ట్ రికార్డింగ్ జరిగింది. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత 1982లో ఎంజీ రాధాకృష్ణన్ కంపోజింగ్‌లో తెరకెక్కిన ఓ సినిమాలో జేసుదాసుతో కలిసి డ్యూయెట్ పాడాను. అదే ఫస్ట్ రిలీజైన సాంగ్. అలా నా జర్నీ మొదలైంది. ఆ తర్వాత రాధా కృష్ణ మ్యూజిక్‌లోనే 5 సినిమాలకు పాడాను. ఆ తర్వాత రవీంద్రన్ మాస్టర్, జాన్సన్ మాస్టర్ దగ్గర పాడాను. అయితే చెన్నైకు నన్ను రికార్డింగ్‌కు తీసుకొచ్చింది మాత్రం రవీంద్రన్ మాస్టర్. 1984 నుంచి ఇలయారాజా దగ్గర పాడిన తర్వాతనే ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ నన్ను సంప్రదించడం ప్రారంభించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
singer chitra ilayaraja songs: ఇళయరాజాతో మీ అనుభవం?
చిత్ర : 1984లో ఒక మలయాళ పాట తమిళ వెర్షన్ పాడేందుకు జరిగిన వాయిస్ టెస్ట్‌కు నేను వెళ్లాను. అప్పుడే ఆయన్ను నేను మొదటి సారి చూశాను. అప్పుడు నేను కాపీ రాగంలో ఓ త్యాగరాజ కీర్తనను పాడాను. ఆ సమయంలో శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడటం వల్ల కాస్త తడబడ్డాను. అయితే ఇళయరాజా మాత్రం నా పాటను కరెక్ట్ చేసి.. ఆల్ ద బెస్ట్ చెప్పి పంపారు. ఆ తర్వాత రోజే నన్ను సాంగ్ పాడేందుకు పిలిచారు. ఆయన కంపోంజింగ్లో పాడిన ప్రతీ పాట నాకు ఒక్కో అనుభవం. పలు రకాల టోన్స్‌తో నాతో ఆయన ఎన్నో పాటలు పాడించారు. అలా ఆయనతో కలిసి నేను ఎన్నో ఎక్స్పరిమెంటల్ ప్రాజెక్టులకు పని చేశాను. సింగింగ్ విషయంలో నాకు ఎన్నో సూచనలు ఇచ్చేవారు. జానకీ, సుశీల లాంటి సీనియర్ సింగర్స్ పాటలను వినమని సూచించేవారు. అవన్నీ నేను ఇప్పటికీ పాటిస్తుంటాను.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మొదటి పాట రికార్డింగ్ సమయంలో మీకు ఎలా అనిపించింది?
చిత్ర : నాకు చాలా భయమేసింది. అయితే ఆ సమయంలో నాతో పాడేందుకు తమిళ సింగర్ గంగై అమరన్ పక్కనే ఉన్నారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఉంటారన్న విషయం అందరికీ తెలుసు. ఎప్పుడూ పక్కనున్న వాళ్లని నవ్విస్తూ ఎంతో ప్రోత్సహిస్తుంటారు. అందుకేనేమో నేను అంత భయంలోనూ బాగా పాడగలిగాను. ఇక ఇలయరాజా అసిస్టెంట్ సుందర రాజన్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. నా ఉచ్ఛారణలోని లోపాలను సరి చేసి ఓ కన్న కూతురికి చెప్పినట్లు నాకు ఎన్నో మెలుకువలు చెప్పారు.
ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు?. దానికి కారణం?
చిత్ర : ప్రతి సింగర్‌కు ఓ ప్రత్యకమైన గుర్తింపు ఉంటుంది. అలాగే ఒక్కొక్కరూ ఒక్కో రకంగా పాడుతారు. ఒక పాట విన్నప్పుడు ఒకరు నచ్చినట్లే.. ఇంకో పాట విన్నప్పుడు ఇంకొకరు నచ్చుతారు. అందుకే నేను ప్రత్యేకించి ఒకరి పేరు అని చెప్పలేను.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మీ మ్యూజికల్ జర్నీలో మీకు కష్టంగా అనిపించిన ఓ సాంగ్.
చిత్ర : అలాంటివి చాలానే ఉన్నాయి. అప్పట్లో 108 అమ్మవార్ల పేర్లను ఒకే సారి చెబుతూ ఓ పాటు పాడాను. శ్వాస కూడా తీసుకోకుండా కంటిన్యూగా పాడేలా ఆ సాంగ్‌ను కంపోజ్ చేశారు. అప్పట్లో ఉన్న టెక్నాలజీ వల్ల నాకు ఆ సమయంలో పాడటం కాస్త కష్టమనిపించింది. ఇక కొన్ని స్పెషల్ ఎక్స్‌ప్రేషన్స్ ఇచ్చి పాడే పాటలు కూడా నాకు కాస్త కష్టమనిపించింది. ముఖ్యంగా ఫోక్ సాంగ్స్ పాడేటప్పుడు కూడా ఉచ్ఛారణలో కాస్త ఇబ్బందిగా అనిపించింది. కాగా, అమ్మవార్ల పేర్లతో చిత్ర పాడిన బాగా ఎంతో ఆక్టటుకున్న సంగతి తెలిసిందే.
ks chitra ar rahman songs : ఏఆర్ రెహ్మాన్ గురించి?
చిత్ర : ఇలయారాజా స్టూడియోకి రికార్డింగ్‌కు వెళ్లినప్పుడు రెహ్మాన్‌ను నేను మొదటి సారి చూశాను. అతను అప్పుడు కీ బోర్డ్ వాయిస్తున్న ఓ చిన్నపిల్లాడు. అప్పుడు అతన్ని రాజా సార్ దిలీప్ అని పిలవడం విన్నాను. ఆ తర్వాత రోజా సినిమా రికార్డింగ్ సమయంలో ఏఆర్ రెహ్మాన్ పేరు విన్నాను. అప్పుడు తెలుసుకున్నాను నేను స్టూడియోలో చూసింది అతన్నే అని తెలిసింది. తన కంపోజింగ్‌లో ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. తొలుత మనల్ని పాడించి ఆ తర్వాత మ్యూజిక్‌ను దానికి తగ్గట్లు రేంజ్ చేసుకుంటారు. ఆ పాట పూర్తి రూపాన్ని మనం ఆడియో మొత్తం వచ్చాకే తెలుసుకోగలం.
మీరు అన్ని భాషల్లోనూ స్పష్టంగా పాడుతారు కదా. దానికి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు?
చిత్ర : ఒక్కో లాంగ్వేజ్‌లో పాడుతున్నప్పుడు ఆయా భాషను నేర్చుకోవాలని నాకు పీ లీల సూచించారు. నేను కేరళలోని తిరువనంతపురం పుట్టినందున నాకు తమిళం కూడా కాస్త తెలుసు. కానీ తెలుగు మాత్రం నేను త్యాగరాజ కీర్తనలు మాత్రం నేర్చుకున్నాను. అయితే తెలుగు పూర్తిగా నేర్చుకుంది మాత్రం ఎస్పీబీ, ఇంకా కొంత మంది మ్యాజిక్ డైరెక్టర్స్ ద్వారానే. ఇక నా యోగా మాస్టర్ కోటేశ్వర్ రావు కూడా తెలుగు డిక్షన్‌ను మెరుగుపరచడంలో సహాయపడ్డారు.
తెలుగులో మీరు పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఎవరు అంటే మీకు ఇష్టం?
చిత్ర : అలా అడగకండి. ఒక్కరి పేరు చెప్పలేం కదా. నేను ఎక్కువగా మెలోడీ సాంగ్స్ పాడాను. అయితే వెరైటీ సాంగ్స్ కూడా పాడాను. ఇలయారాజా, కోటీ, మణిశర్మ, కీరవాణి లాంటి మంచి డైరెక్టర్స్ దగ్గర పని చేశాను.
ఎస్పీబీ గురించి?
చిత్ర : నేను తెలుగులో సాంగ్స్ బాగా పాడుతున్నానంటే దానికి ఎస్పీబీ కూడా ఓ పెద్ద ఇన్స్పిరేషన్. రికార్డింగ్ టైమ్‌లో నాకు డిక్షన్, ఎక్స్ప్రెషన్స్ లాంటి విషయాల్లో ఆయన ఎన్నో మెలుకువలు చెప్పారు. తనతో పని చేసే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే గొప్ప మనస్తత్వం ఆయనది. నాకు తెలుగు మాట్లాడటంతో పాటు చదవడం నేర్పించారు. ఆయనతో నా అనుభవం గురించి చెప్పాలంటే ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
నాకు ఇప్పటికి గుర్తుంది. మలేషియాలో ఓ షో చేసేందుకు వెళ్లిన సమయంలో నాకు ఆరోగ్యం కాస్త బాలేదు. హై రేంజ్ నోట్స్ ఉన్న ఓ పాట కూడా సాంగ్స్ లిస్ట్‌లో ఉంది. దాన్ని చూసి నేను ఇక ఈ పాటను పాడలేనేమో అని అంటుండగా.. ఎస్పీబీ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. హై నోట్స్ వచ్చిన సమయంలో నా వైపు చూసి నన్ను ప్రోత్సహించారు. ఆ ఘటన ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తోంది. అలాగే ఓ సారి యూఎస్ టూర్‌కు ఎస్పీబీ, శైలజ, చరణ్, నేను కలిసి వెళ్లాము. ఒక్కో రోజు ఒక్కో లాంగ్వేజ్ కాన్సర్ట్ జరిగింది. అందులో కొన్ని కోరస్ పాడాల్సిన సాంగ్స్ కూడా ఉన్నాయి. అప్పుడు నేను, శైలజ కలిసి దాని కోసం ప్రాక్టీస్ చేశాము. అప్పుడు ఎస్పీబీ మా దగ్గరికి వచ్చారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయనే దగ్గరుండి మా చేత ప్రాక్టీస్ చేయించారు. అది నేను ఎప్పటికీ మరిచిపోలేను.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మీకు సినిమా సాంగ్స్ పాడటం ఇష్టమా.. లేకుంటే కచేరీలు చేయడం ఇష్టమా ?
చిత్ర : నేను నేర్చుకున్నది కర్ణాటిక్ మ్యూజిక్. అయితే సినిమాల్లో కూడా పాడుతున్నాను. ఒకే సమయంలో రెండింటినీ తీసుకెళ్లడం నాకు కాస్త కష్టమనిపించింది. ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్ పాడుతున్నప్పుడు కొంచెం వాయిస్ కాస్త్ స్ట్రెయిన్ అవుతుందని నాకు అనిపించింది. అందుకోసమే ఇప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్కువ పాడటం లేదు. కానీ నేను ఆల్బమ్స్ చేస్తున్నాను.
మీరు దాదాపు 40 ఏళ్లకు పైగా ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కదా. ఎప్పుడైన ఇక చాలు రెస్ట్ తీసుకుందామని మీకు అనిపించిందా ?
చిత్ర : అందరు సింగర్స్‌కు పాటల విషయంలో చాలు అనేది ఉండదు. చచ్చేంతవరకు పాడాలనే అనుకుంటుంటారు. నాకు కూడా అదే ఆశ. అయితే నా వాయిస్ ఎంత వరకు హీరోయిన్స్‌కు సూట్ అవుతుందో అంత వరకు పాడుతాను. లేకుంటే క్లాసిక్ కర్ణాటిక్, భజన్స్ లాంటివి పాడుతాను. కానీ ఎప్పటికీ పాడుతుండాలి. అదే నా కోరిక.
సింగర్ లతా మంగేష్కర్తో మిమల్నీ తరచూ పోలుస్తుంటారు. దీని పై మీ అభిప్రాయం.
చిత్ర : నవ్వుతూ.. నేను చిన్నప్పటి నుంచి లతా, ఆశ, సుశీల, జానకీ పాటలను వింటూ వచ్చాను. ఆమెను నా జీవితంలో ఒక్కసారైనా కలుసుకోవాలనిఅనుకున్నాను. కానీ నేను ఆమెతో ఐదు సార్లు ఫోన్లో మాట్లాడాను. రెండు మూడు సార్లు నేరుగా కలుసుకున్నాను. లతాజీ బర్త్‌డేకి కూడా ఆమె ముందు పాడే అవకాశం లభించింది. ఇవన్నీ నాకు ఎంతో స్పూర్తిని ఇచ్చాయి. లతాజీ పేరు మీద హైదరాబాద్‌లో ఓ అవార్డు కూడా అందుకున్నాను. అయితే అప్పుడు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను. అయినప్పటికీ లతాజీ నువ్వు రావాలి.. నేను కూడా వస్తున్నాను అంటూ నన్ను అక్కడికి పిలిచి నాకు ఆ అవార్డు ఇచ్చారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా లతాజీ ఆ ఫంక్షన్‌కి రాలేకపోయారు.
కంపోజింగ్ చేయడం గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? భవిష్యత్తులో ఏదైనా కంపోజిషన్ చేయనున్నారా ?
చిత్ర : కంపోజింగ్ అనేది నాకు రాదు. నేను బాగా పాడలని మాత్రమే నేను కోరుకుంటాను. అది చాలు నాకు.
అప్‌కమింగ్ సింగర్స్‌కు మీ సూచన
చిత్ర : అప్‌కమింగ్ సింగర్స్‌కి నేను చెప్పేది ఒక్కటే. నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అదే మీకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది.
ఇప్పుడైతే సినిమాలో పాడేందుకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో అలా లేదు. ఇప్పటి జనరేషన్ అదృష్టవంతులని మీరు అనుకుంటున్నారా?
చిత్ర : ఇప్పటి పిలల్లకు చాలా అవకాశాలున్నాయి. అందరికి ఒక్కో పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. దీని వల్ల వాళ్ల పరిధి కూడా విస్తరిస్తూ వస్తోంది. అయితే నేను సింగింగ్ స్టార్ట్ చేసిన సమయంలో ఇవేవి లేవు. ఇలా రియాల్టీ షోస్ లేవు. మార్గ నిర్దేశకం చేసేందుకు ఎవరూ లేదు. ఏదో వచ్చినట్లు అలా పాడేసేవాళ్లం. అయితే ఇప్పటి పిల్లలు చాలా లక్కీ. రియాల్టీ షోల్లో పాల్గొనడం వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో దోహద పడుతుంది. ఒక పాటను ఎలా నేర్చుకోవాలి. దాన్ని ఎలా పాడాలన్న విషయాలను నేర్పించి వాళ్లను తీర్చిదిద్దడం వల్ల వారు మంచి సింగర్స్‌గా బయటకి వస్తున్నారు.
ఇదీ చూడండి :