ETV Bharat / entertainment

సరోగసిపై సింగర్ చిన్మయి రియాక్షన్​.. ఒక్కఫోటోతో ఆ రూమర్స్​కు చెక్​ - సరోగసి చిన్మయి పోస్ట్​

సరోగసి ద్వారా చిన్మయి దంపతులు బిడ్డలకు జన్మనిచ్చారంటూ సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. ఈ క్రమంలో చిన్మయి శ్రీపాద ఇన్‌స్టా వేదికగా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

Surogacy chinmayi
సరోగసిపై సింగర్ చిన్మయి రియాక్షన్​
author img

By

Published : Oct 18, 2022, 8:41 PM IST

సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను సూటిగా పంచుకుంటారు గాయని చిన్మయి శ్రీపాద. ఇటీవలే ఆమె కవలపిల్లలు జన్మించినట్లు సోషల్​ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అందుకు కారణం ప్రెగ్నెంట్‏గా ఉన్న ఫోటోస్ ఆమె ఒక్కటి కూడా నెట్టింట షేర్ చేయలేదు. దీంతో ఆమె సరోగసి ద్వారా పిల్లలకు జన్మచ్చిందంటూ విమర్శలు వచ్చాయి. అయితే తనపై వస్తున్న కామెంట్లను చిన్మయి పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు నయన్.. విఘ్నేష్ దంపతులు సరోగసి పద్ధతితో పిల్లలకు జన్మనివ్వడంతో మళ్లీ సరోగసీ వివాదం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే చిన్మయి తనపై వచ్చిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ఒక్క ఫోటోతో విమర్శలకు చెక్ పెట్టారు. ఆమె ప్రెగ్నెంట్‏గా ఉన్నప్పుడు దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. ప్రెగ్నెంట్‏గా ఉన్నప్పుడు నేను తీసుకున్న మొదటి సెల్ఫీ ఇది.. అంటూ రాసుకొచ్చారు.

"32 వారాల తర్వాత నా ఫొటోను ఇప్పుడే మీతో పంచుకుంటున్నా. వీలైనన్ని ఎక్కువ ఫొటోలు తీసుకోలేనందుకు నాకు బాధగా ఉంది. అయితే, దీని వెనుకున్న కారణాన్ని మీకు ఇంతకు ముందే యూట్యూబ్‌ వేదికగా చెప్పాను. మొదటిసారి గర్భస్రావం అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ భయంగానే ఉంటుంది. కడుపుతో ఉన్నా కూడా నా వృత్తి జీవితాన్ని కొనసాగించా. అయితే, దయచేసి ఎవరూ ఫొటోలు తీయవద్దని, నా వ్యక్తిగత విషయాలకు భంగం కలిగించవద్దని మాత్రం విజ్ఞప్తి చేసేదాన్ని. అయితే, సరోగసిపై వస్తున్న ప్రశ్నలకు ఇదే సమాధానం. సరోగసి, ఐవీఎఫ్‌, లేదా సహజ గర్భం ఇలా ఏ రూపంలోనైనా పిల్లలు కావాలనుకోవడం నా వరకూ పెద్ద విషయం కాదు. అమ్మ అంటే అమ్మే.. అది మనుషులైనా జంతువులైనా. నాకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టారని ఎవరైనా అనుకుంటే నేనేమీ లెక్కచేయను. ఎవరు ఏదైనా అనుకోనీయండి. వాళ్ల అభిప్రాయం అది. నాకు ఎలాంటి సమస్యలేదు" అంటూ విమర్శకులకు కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. అలాగే తన పిల్లలకు పాలు పడుతున్న ఫొటోను కూడా పంచుకుంటూ 'ప్రపంచంలోనే గొప్ప విషయం' అంటూ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'గీతా ఆర్ట్స్‌'లో 'గీత' ఎవరో తెలుసా? సీక్రెట్​ చెప్పేసిన అల్లు అరవింద్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.