ETV Bharat / entertainment

హాలీవుడ్​ మూవీతో 'జవాన్​' ట్రైలర్ గ్రాండ్​ రిలీజ్​.. 'యానిమల్​' విడుదల​ వాయిదా.. కారణం అదే! - జవాన్​ సినిమా ట్రైలర్​ విడుదల తేదీ

Shah Rukh Khan Jawan Trailer : ప్రముఖ బాలీవుడ్​ స్టార్​ షారుక్ ఖాన్​ నటిస్తున్న సినిమా 'జవాన్'. ఈ సినిమా ట్రైలర్​ను హాలీవుడ్​ స్టార్​ టామ్ క్రూజ్​ 'మిషన్​ ఇంపాజిబుల్​-7' మూవీకి జత చేశారు. దీంతో షారుక్​ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్​ హీరో రణ్​బీర్​ కపూర్ హీరోగా.. తెలుగు డైరెక్టర్​ సందీప్​ వంగ తెరకెక్కిస్తున్న 'యానిమల్​' మూవీ విడుదల వాయిదా పడింది. దీనికి గల కారణాలను దర్శకుడు వివరించారు. బాలీవుడ్ సూపర్​ స్టార్​ అక్షయ్​ కుమార్​ నటిస్తున్న సినిమా 'OMG2'. ఈ మూవీ రిలీజ్ తేదీని సోమవారం అక్షయ్​ప్రకటించారు. పూర్తి వివరాలు ఇవే..

Shah Rukh Khan Jawan Trailer
Shah Rukh Khan Jawan Trailer
author img

By

Published : Jul 3, 2023, 5:53 PM IST

Updated : Jul 3, 2023, 6:03 PM IST

Shah Rukh Khan Jawan Trailer : బాలీవుడ్​ అగ్ర హీరో షారుక్​ ఖాన్..​ 'పఠాన్​'తో బ్లాక్​బస్టర్​ హిట్​ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 'జవాన్'​ సినిమాతో మరోసారి బాక్సాఫీసును బద్దలుగొట్టడానికి రాబోతున్నారు. త్వరలో ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేయనున్నారు. అయితే, ఈ మూవీ ట్రైలర్​ను ప్రముఖ హాలీవుడ్​ హీరో టామ్​ క్రూజ్​ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్​: డెడ్​ కమింగ్​ పార్ట్​ 1'కు జతచేయనున్నారు. జులై 12న ఈ సినిమాతో పాటు.. 'జవాన్​' ట్రైలర్​ కూడా థియోటర్లలో గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. షారుక్​ సినిమా ప్రచార చిత్రాన్ని టామ్​ క్రూజ్​ చిత్రానికి జత చేయడం వల్ల ఫ్యాన్స్​ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'జవాన్​' చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్​ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమాలో షారుక్​ సరికొత్త లుక్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్​ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్​తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇంతకుముందు విడుదల చేసిన టీజర్​తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో షారుక్​తో పాటు తమిళ నటుడు విజయ్​ సేతుపతి, నయనతార, బాలీవుడ్​ నటి సన్యా మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. షారుక్​ సొంత బ్యానర్​​ రెడ్​ చిల్లీస్​ ఎంటర్‌టైన్‌మెంట్​లో తెరకెక్కుతున్న ఈ మూవీని ఆయన భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు.

'యానిమల్'​ ఇంకా ఆలస్యం.. అదే కారణం!
Animal Movie Postponed : సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'యానిమల్‌'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్​ సందీప్‌ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్​ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్​ సందీప్‌ వంగా ప్రకటించారు. దీనికి గల కారణాన్ని, కొత్త విడుదల తేదీని తెలుపుతూ ఆయన వీడియో షేర్‌ చేశారు. ''ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలవుతుంది. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. ఐదు భాషలకు తగినట్లు వాటిలో మార్పులు చేయాలి. మొత్తం 35 పాటలకు చాలా పని చేయాలి. వాటిని రికార్డ్‌ చేయాలంటే ఇంకా సమయం పడుతుంది. అందువల్లే నిర్మాణాంతర పనులు ఆలస్యం​ అవుతున్నాయి' అని సందీప్ వంగ అన్నారు.

'హిందీ కాకుండా మిగతా భాషల్లో ఈ పాటలు విన్న వారికి డబ్బింగ్‌ పాటల్లా అనిపించకూడదని నా అభిప్రాయం. అందుకే చాలా శ్రద్ధగా వర్క్‌ చేస్తున్నాం. దీనికోసం చాలా సమయం, శ్రమ పెట్టాల్సి ఉంటుంది. ప్రేక్షకులందరికీ వీడియో, ఆడియో పరంగా కూడా సినిమాను ఉత్తమంగా అందిస్తానని ప్రామిస్​ చేస్తున్నా. మొదట ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలని భావించినా.. ప్రోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో జాప్యం కారణంగా దీన్ని డిసెంబర్‌1కు వాయిదా వేస్తున్నాం. కంటెంట్‌, భావోద్వేగాల పరంగా ఇది చాలా పెద్ద సినిమా' అని సందీప్​ వివరించారు.

దీంతో పాటు సినిమా టీజర్​పై వచ్చిన నెగటివ్​ కామెంట్లకు సమాధానమిచ్చారు. 'యానిమల్‌’ టీజర్‌ను ఆదరించిన అందరికీ నా ధన్యవాదాలు. టీజర్​పై కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ టీజర్‌ను సినిమాలోని ఎపిసోడ్‌ నుంచే కట్‌ చేశాం. కాబట్టి ఆ కంటెంట్‌ అంతా చిత్రంలో ఉంటుంది. డిసెంబర్‌ 1న అందరూ థియేటర్లకు వచ్చి రణ్‌బీర్ కపూర్‌ విశ్వరూపం చూడండి' అని సందీప్‌ వంగా కోరారు.

అక్షయ్​ కుమార్​.. 'ఓ మై గాడ్-2'!​​
Akshay Kumar OMG 2 Release Date : బాలీవుడ్​ సూపర్​ స్టార్​ అక్షయ్​ కుమార్​ 'OMG2'తో ఆగస్టు 11 ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మేరకు సోషల్​ మీడియా వేదికగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. త్వరలోనే టీజర్​ను కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్​ను షేర్​ చేశారు అక్షయ్​ కుమార్​. అందులో సరికొత్త లుక్​లో ఆయన కనిపించారు. OMG సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అమిత్​ రాయ్​ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో పంకజ్​ త్రిపాఠి, యామీ గౌతమ్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అక్షయ్ మరో సినిమాతో ప్లేక్షకులు ముందుకు రానున్నారు. సూపర్​ హిట్​ తమిళ సినిమా 'సూరారై పొట్రు' సినిమాకు రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్​ 1న విడుదల కానుంది. అయితే, ఈ మూవీ టైటిల్ ఇప్పటివరకు మేకర్స్ అనౌన్స్​ చేయలేదు​.

Last Updated : Jul 3, 2023, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.