ETV Bharat / entertainment

అంబానీ కల్చరల్ సెంటర్​లో భార్యతో షారుక్​ ఫైట్​​.. ఫ్యాన్స్​ ఫుల్​ ఫైర్​! - షారుక్​ ఖాన్ గౌరీ ఖాన్ ఫైట్​ ​ వీడియో

బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్​కు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. దీన్ని చూసిన షారుక్​ ఫ్యాన్స్​ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే?

Shah Rukh khan and Gauri khan video viral
షారుక్​ ఖాన్ గౌరీ ఖాన్ ఫైట్ వీడియో వైరల్
author img

By

Published : Apr 5, 2023, 6:16 PM IST

ముంబయిలో నీతా ముకేశ్​ అంబానీ కల్చరల్​ సెంటర్​ ఓపెనింగ్​ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ​ వేడుకల్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. ఈ ప్రోగ్రాంలో షారుక్​ ఖాన్​.. తన భార్య గౌరీ ఖాన్​తో గొడవ పడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షారుక్​ తన భార్య గౌరీతో తీవ్రంగా గొడవపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని చూసిన షారుక్​ ఖాన్​ ఫ్యాన్స్​ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు! భార్య గౌరీ ఖాన్​తో ఎంతో ప్రేమగా ఉండే షారుక్​ ఇలా ప్రవర్తించడం ఏంటంటూ ఫ్యాన్స్​ ఫైర్​ అవుతున్నారు​.

వైరల్​ అవుతున్న వీడియోలో షారుక్​ ముందుగా బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత రితేశ్​ సిద్ధవానిని కౌగిలించుకున్నారు. ఆపై వేదిక వద్ద ఉన్న భార్య గౌరీ ఖాన్​ను రితేశ్​కు చూపించారు షారుక్. ఇది గమనించిన గౌరీ షారుక్​తో వాగ్వాదానికి దిగారు. దీంట్లో అక్కడే డ్యాన్స్​ చేస్తున్న గౌరీ వైపు షారుక్​ కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో బాద్​షా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఈవెంట్​కు ప్రముఖ హీరోయిన్​ ప్రియాంక చోప్రా కూడా హాజరయ్యారు. అయితే ఈ చిన్నపాటి వివాదంలోకి నటి ప్రియాంకను కూడా లాగుతున్నారు నెటిజన్లు. ఎందుకంటే 'డాన్'​ సినిమా షూటింగ్​ సమయంలో వీరిద్దరి మధ్య ఎఫైర్​ నడిచిందిన అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. ఆ కారణంగానే షారుక్​.. గౌరితో గొడవ దిగారని బ్లేమ్​ చేస్తున్నారు ఫ్యాన్స్​. ఈ కార్యక్రమంలో షారుక్​ ప్రియాంకతో కలిసి స్టెప్పులేసినట్లుగా కొన్ని విజువల్స్​ కూడా బయటకు వచ్చాయి.

షారుక్, గౌరీ ఖాన్​ గొడవ పడుతున్న వీడియో చూసిన కొందరు ఫ్యాన్స్​ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ప్రవర్తనతో హీరో షారుక్​ను కాస్త విలన్​గా చూస్తున్నారు. ఈ వ్యవహారంపై కొందరు డిఫరెంట్​గా కామెంట్స్ పెడుతున్నారు. ఒకరైతే 'షారుక్​ మమ్మల్ని మోసం చేశారు.. ఇప్పటివరకూ భార్యతో ప్రేమగా ఉన్నట్లు షారుక్​ నటించారు' అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్​.. 'ఇది మీ అస్సలు కథ.. అందరిముందు మంచివాడిలా నటిస్తూ భార్యతో ఇలా ప్రవర్తిస్తావా?' అంటూ ఫైర్​ అయ్యాడు.

షారుక్​ నటించిన పఠాన్​ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా సూపర్​ హిట్​ సాధించి భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం షారుక్​ నటించిన జవాన్​ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. జూన్​ 2న రిలీజ్​ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.