ETV Bharat / entertainment

'విషమంగానే సూపర్​స్టార్​ ఆరోగ్యం'.. రెండో హెల్త్​ బులిటెన్​​లో డాక్టర్లు - సూపర్​స్టార్​ కృష్ణ ఆరోగ్యం

Super Star Krishna Health Condition: సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై రెండో హెల్త్​ బులెటిన్​ విడుదల చేశారు వైద్యులు. ఏం చెప్పారంటే..

super star krishna health
super star krishna health
author img

By

Published : Nov 14, 2022, 8:10 PM IST

Updated : Nov 14, 2022, 8:39 PM IST

Super Star Krishna Health Condition: సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్​ బులిటెన్​ విడుదల చేశారు వైద్యులు. కృష్ణ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ గురునాథ్ రెడ్డి వెల్లడించారు. వెంటిలేటర్‌పైనే వైద్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. అ‍న్ని విభాగాలకు చెందిన 8 మంది వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. ఆయనకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి ఉంటుందని వైద్యులు అంటున్నారు. బ్రెయిన్‌లో చాలా వరకు ఎఫెక్ట్‌ అయినట్లు వెల్లడించారు.

'విషమంగానే సూపర్​స్టార్​ ఆరోగ్యం'.. రెండో హెల్త్​ బులిటెన్​​లో డాక్టర్లు

కృష్ణకు అంతర్జాతీయ స్థాయిలో వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు స్పష్టం చేశారు. ఆయన మా ఆస్పత్రిలోనే చాలా ఏళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని గురునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన పరిస్థితిపై బులెటిన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులను డిస్టర్బ్‌ చేయవద్దని కోరారు. కాగా.. ఆయనకు తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు.

second health bulletin on super star krishna health
డాక్టర్లు విడుదల చేసిన రెండో హెల్త్​ బులిటెన్​

కృష్ణ ఆరోగ్యంపై స్పందించిన నరేశ్..
కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై నరేశ్‌ స్పందించారు. కృష్ణకు చికిత్స జరుగుతున్న కాంటినెంటల్‌ ఆస్పత్రికి చేరుకున్న నరేశ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. "రాత్రి అస్వస్థతకు గురైతే ఆస్పత్రిలో చేర్పించాం. పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉంది. శ్వాస తీసుకుంటున్నారు. ఆయన హెల్త్‌ అప్‌డేట్స్‌ మేం ఇవ్వడం కాదు వైద్యులే అధికారికంగా ఇస్తున్నారు. 48 గంటలు గడిస్తేనే కానీ స్పష్టతరాదు. పరిస్థితి ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నా. ఆయన రీల్‌లైఫ్‌లో, రియల్‌ లైఫ్‌లో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌. ఆయన చేసినన్ని పోరాటాలు ఎవరూ చేయలేదు. ఇప్పటికీ బలంగా ఉన్నారు. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. వృద్ధాప్యం కాబట్టి సహజంగా కొన్ని మార్పులు వస్తాయి. దానిపై ఆయన పోరాడుతున్నారు. అభిమానులంతా ఆయన క్షేమంగా తిరిగిరావాలని దైవాన్ని ప్రార్థించండి" అని నరేశ్‌ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: విషమంగా సూపర్​స్టార్​ కృష్ణ ఆరోగ్యం​.. హెల్త్​ బులిటెన్​ విడుదల చేసిన డాక్టర్లు

Last Updated : Nov 14, 2022, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.