Sankranthi 2024 Movies : సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే 'జైలర్' చిత్రంతో దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి.. గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ విజయాన్ని మర్చిపోనేలేదు.. అంతలోనే రజనీ నటించిన మరో లేటెస్ట్ మూవీ సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అయిపోయింది. అదే 'లాల్ సలాం'(Rajnikanth Laal Salaam). ఈ చిత్రంలో మొయిద్దీన్ భాయ్ అనే గెస్ట్ రోల్లో రజనీ నటించారు.
ఈ సినిమాను రజనీ కాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించడం విశేషం. స్పోర్ట్స్ అండ్ మాఫియా బ్యాక్ డ్రాప్లో రానున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ప్రముఖ నిర్మామ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
-
LAL SALAAM to hit 🏏 screens on PONGAL 2024 🌾☀️✨
— Lyca Productions (@LycaProductions) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj
✂️🎞️ @BPravinBaaskar
👕 @NjSatz
🎙️ @RIAZtheboss @V4umedia_
🎨🖼️ @kabilanchelliah
🤝 @gkmtamilkumaran… pic.twitter.com/4XOg3sozSs
">LAL SALAAM to hit 🏏 screens on PONGAL 2024 🌾☀️✨
— Lyca Productions (@LycaProductions) October 1, 2023
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj
✂️🎞️ @BPravinBaaskar
👕 @NjSatz
🎙️ @RIAZtheboss @V4umedia_
🎨🖼️ @kabilanchelliah
🤝 @gkmtamilkumaran… pic.twitter.com/4XOg3sozSsLAL SALAAM to hit 🏏 screens on PONGAL 2024 🌾☀️✨
— Lyca Productions (@LycaProductions) October 1, 2023
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj
✂️🎞️ @BPravinBaaskar
👕 @NjSatz
🎙️ @RIAZtheboss @V4umedia_
🎨🖼️ @kabilanchelliah
🤝 @gkmtamilkumaran… pic.twitter.com/4XOg3sozSs
పెరిగిపోతున్న జాబితా.. అయితే ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వరకు అంతా బాగానే ఉంది కానీ.. అసలు సవాల్ ఇక్కడే మొదలైంది. సంక్రాంతి పండక్కు బరిలోకి దిగే చిత్రాల జాబితా చూస్తే.. బాక్సాఫీస్ రేసు రసవత్తరంగా ఉండనుందని తెలుస్తోంది. రోజురోజుకు ఈ పొంగల్‌కు విడుదల కానున్న సినిమా లిస్ట్ పెరిగిపోతూ వస్తోంది.
టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం, విజయ్ దేవరకొండ - పరశురామ్ చిత్రం, తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ హనుమాన్, నాగార్జున నా సామిరంగ కూడా ముగ్గుల పండక్కే కన్ఫామ్ చేసుకున్నాయి. సలార్ దెబ్బకు క్రిస్మస్కు విడుదల కావాల్సిన వెంకటేశ్ సైంధవ్ కూడా పతాకాల పండక్కే రానుందని అంటున్నారు. రవితేజ ఈగల్ కూడా సంక్రాంతికే ఖరారు చేసుకుంది.
డబ్బింగ్ చిత్రాలు కూడా.. ఇవన్నీ విడుదల కావడం ఒక ఎత్తైతే.. కోలీవుడ్ నుంచి ఇదే సంక్రాంతికి రానున్న డబ్బింగ్ చిత్రాల జాబితా కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే హీరో శివకార్తికేయన్ నటించిన అయలాన్, సుందర్ సి తెరకెక్కించిన హారర్ కామెడీ అరణ్మయి 4 కూడా ఈ ముగ్గుల పండక్కే డేట్‌ను ఖారారు చేసుకున్నాయి.
ఇదంతా చూస్తుంటే.. సంక్రాంతి రేసు ఎంత రసవత్తరంగా మారనుందనేది పక్కనపెడితే.. అసలు ఇన్ని చిత్రాలకు థియేటర్లు దొరుకుతాయా అన్నది పెద్ద సందేహంగా మారింది. తెలుగు సినిమాలకే దొరకడం కష్టమనుకుంటే.. ఇప్పడేమో డబ్బింగ్ సినిమాల కోసం థియేటర్లు దొరకడం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్ లాంటిదనే చెప్పాలి. ఏదిఏమైనా ఇన్ని చిత్రాలు ఒకేసారి రావడమంటే... అది వసూళ్లపైన కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. చూడాలి మరి ఇంకా మూడు నెలలు సమయం ఉంది కాబట్టి.. ఏమైనా చిత్రాలు వెనక్కి తగ్గుతాయో.. లేదంటే అలానే రిలీజ్‌కు రెడీ అయిపోతాయో చూడాలి...
Salaar Ugramm Remake : 'సలార్'.. ఉగ్రమ్ రీమేక్ ప్రచారంలో నిజమెంత?
Salaar Vs Dunki Clash : డైనోసార్ రాకకు డేట్ కన్ఫామ్.. ఇక ఈ చిత్రాలన్నీ తప్పుకోవాల్సిందే!