Sandeep Reddy Vanga Interview: 'యానిమల్' సినిమాతో కెరీర్లో మరో హిట్ అందుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్- రష్మికా మందన్నా లీడ్ రోల్స్‌లో సందీప్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజై, బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది మూవీటీమ్. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా తనకు ఎదురైన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానమివ్వడం సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది.
అయితే తన సినిమాల్లో హీరోలను పెద్ద ఘనత సాధించిన వారిలా చూపించి, మహిళలను మాత్రం ఇంటికే పరిమితం చేస్తారు. ఎందుకు? అనే ప్రశ్న సందీప్‌కు ఎదురైంది. దీంతో ఆయన 'ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే అందరూ ఉద్యోగం చేయడమో, బిజినెస్ చేయడమో,టీచర్లను చూపించడమో చేస్తారు. హౌస్ వైఫ్‌ను ఉమెన్ ఎంపవర్మెంట్గా గుర్తించరు. కానీ, నా దృష్టిలో అదే అతిపెద్ద ఉద్యోగం. ఇంట్లో ఉంటుూ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడంలో తల్లి పాత్ర పెద్దది' అని జవాబిచ్చారు.
Animal Movie Box Office Collection: యానిమల్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ.862.21 కోట్లు వసూల్ చేసింది. అటు నార్త్ అమెరికాలోనూ కాసుల వర్షం కురిపించి, నాలుగో అతి పెద్ద ఇండియన్ ఫిల్మ్‌గా నిలిచింది. ఈ సినిమాతో డైరెక్టర్ సందీప్‌రెడ్డి మరోసారి బాలీవుడ్లో తన మార్క్ చాటుకున్నారు. ఇక సందీప్ తర్వాతి ప్రాజెక్ట్ కోసం పాన్ఇండియా స్టార్ ప్రభాస్‌తో జతకట్టనున్నారు. వీరి కాంబోలో స్పిరిట్ తెరకెక్కనుంది.
-
#Animal stands as an unrivalled cinematic triumph🪓🔥
— Animal The Film (@AnimalTheFilm) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Book your tickets 🎟️- https://t.co/kAvgndK34I#AnimalInCinemasNow #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep… pic.twitter.com/KZbjXbM0vw
">#Animal stands as an unrivalled cinematic triumph🪓🔥
— Animal The Film (@AnimalTheFilm) December 22, 2023
Book your tickets 🎟️- https://t.co/kAvgndK34I#AnimalInCinemasNow #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep… pic.twitter.com/KZbjXbM0vw#Animal stands as an unrivalled cinematic triumph🪓🔥
— Animal The Film (@AnimalTheFilm) December 22, 2023
Book your tickets 🎟️- https://t.co/kAvgndK34I#AnimalInCinemasNow #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep… pic.twitter.com/KZbjXbM0vw
Animal Movie Cast: ఈ సినిమా విషయానికి వస్తే, తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన 'యానిమల్'లో ఈ సినిమాలో హీరో రణ్‌బీర్‌కు జంటగా అందాల తార రష్మిక మందన్నా నటించింది. తండ్రీ కుమారుల సెంటిమెంట్‌తో దర్శకుడు సందీప్‌రెడ్డి సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించారు. 'యానిమల్' తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో డిసెంబర్ 1న విడుదలైంది.
'నేనెప్పుడూ అలా చేయలేదు, చేయను కూడా'- సినీ క్రిటిక్స్‌పై సందీప్ ఫైర్!
బాక్సాఫీసు ముందు 'యానిమల్' ర్యాంపేజ్- రూ.660 కోట్లు దాటిన కలెక్షన్స్