ETV Bharat / entertainment

ప్రభాస్ మాస్ ర్యాంపేజ్​- 'సలార్' ట్రైలర్​ రిలీజ్​ - Salaar Movie Release Date

Salaar Trailer Telugu Release : పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం 'సలార్'. కేజీఎఫ్ ఫేమ్​ ప్రశాంత్​ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్​ను శుక్రవారం విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఆ ట్రైలర్​ మీరూ చూసేయండి.

Salaar Trailer Telugu youtube
Salaar Trailer Telugu youtube
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 7:21 PM IST

Updated : Dec 1, 2023, 7:59 PM IST

Salaar Trailer Telugu Release : Salaar Trailer Telugu : పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం 'సలార్‌ పార్ట్‌ 1- సీజ్‌ఫైర్‌'. కేజీఎఫ్ ఫేమ్​ ప్రశాంత్​ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్​ను శుక్రవారం విడుదల చేశారు. హీరో ఎలివేషన్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌, విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌.. ఇలా ప్రతిదీ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మార్క్‌కు తగ్గట్లు ఉంది. 3 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ పాత్రకు సంబంధించి బాల్య సన్నివేశాలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. విడుదలైన 15 నిమిషాల్లోనే 17 లక్షల వ్యూస్‌ సొంతం చేసుకోవడం విశేషం. అంటే నిమిషానికి లక్షమందికిపైనే ఈ ట్రైలర్‌ను వీక్షించారు.

Salaar Story In Telugu : బద్ధ శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో 'సలార్‌' రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్​ పాత్రలో నటిస్తున్నారు. 'సలార్‌'.. 'కేజీయఫ్‌' యూనివర్స్‌లోకి వస్తుందనే రూమర్స్‌పై ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల స్పందించారు. రెండింటికీ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక సలార్​ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్‌ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాపై యంగ్‌ రెబల్‌ స్టార్‌ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో భారీ స్థాయిలో యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని గతంలో చిత్ర యూనిట్ చెప్పింది. ఈ సినిమా పతాక సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని. కచ్చితంగా అవి ఒక బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేస్తాయని చెప్పారని టాక్‌.

Salaar Movie Cast : కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సలార్ మూవీ ఐదు భాషల్లో రూపుదిద్దుకుంది. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలో నటించారు. ఈ నెల 22న (Salaar Movie Release Date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా విడుదలైన 'కాంతార' సినిమాను కూడా హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పతాక సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి. వాటిని మించి సలార్‌ సన్నివేశాలు ఉండబోతున్నాయని ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.

ఇంటర్​లోనే రష్మికకు సినిమా ఛాన్స్​- కానీ కుటుంబ సభ్యులు అలా అనేసరికి!

డేంజర్​ జోన్​లో స్ట్రాంగ్​ కంటిస్టెంట్స్​ - ఆ ఇద్దరిలో బిగ్​బాస్​ హౌస్ వదిలేది ఎవరు?

Last Updated : Dec 1, 2023, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.