ETV Bharat / entertainment

Salaar Break RRR Record : రిలీజ్​కు ముందే RRR రికార్డ్​ బ్రేక్​.. ఇంటర్వెల్​ సీన్​ వేరే లెవల్​! - సలార్​ప్రశాంత్​ నీల్​

Salaar Break RRR Record : విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డు బ్రేక్ చేసింది సలార్ మూవీ. సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా.. అమెరికాలో అరుదైన ఘనత సాధించింది.

salaar break rrr record
salaar break rrr record
author img

By

Published : Aug 9, 2023, 12:28 PM IST

Updated : Aug 9, 2023, 1:08 PM IST

Salaar Break RRR Record : పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​, కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సలార్​. రెండు పార్ట్​లుగా రూపొందుతున్న సినిమాకు తొలి భాగానికి సలార్: పార్ట్ 1 సీజ్‌ఫైర్​గా పేరు పెట్టారు. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సినిమా.. విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది.

అమెరికాలో ఆర్​ఆర్​ఆర్​ రికార్డును సలార్​ బ్రేక్​ చేయడం విశేషం. ఆ దేశంలోని సుమారు​ అన్ని సినీ మార్క్​ థియేటర్లలో సలార్​ విడుదల కానుందని యూఎస్​ డిస్ట్రిబ్యూటర్​ వెల్లడించారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ ఘనత సాధించలేదు. ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం 285 సినీమార్క్ థియేటర్లలో రిలీజై రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు సలార్ దానిని అధిగమించబోతోంది. అంతేకాదు నార్త్ అమెరికాలో ఏకంగా సలార్ మూవీ 1980కిపైగా స్క్రీన్లలో రిలీజ్ కాబోతోంది. ఐమ్యాక్స్ వెర్షన్ కూడా అక్కడ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Salaar Movie Cast : సలార్ సినిమాలో భారీ తారాగణం కనిపించనుంది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, కొందరు కన్నడ నటీనటులు, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. సాంకేతిక బృందంలో ఎక్కువ మంది కేజీఎఫ్ సాంకేతిక నిపుణులు ఉన్నారు. నటుడు యశ్​ కూడా సలార్​లో అతిథి పాత్రలో నటించినట్లు సమాచారం. సలార్ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్​ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై ప్రశంసలు అందుకుంది.

Salaar Prashanth Neel : దర్శకుడు ప్రశాంత్ నీల్.. మేకింగ్, కథ చెప్పడంలో తనదైన శైలితో ఉంటారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల్లో ప్రేక్షకులు ఆ విషయం గుర్తించారు. సలార్ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తరహాలో తీశారని అంటున్నారు. స్టైల్‌ మాత్రమే కాదు.. కేజీఎఫ్‌ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని సలార్‌లో ఆ సినిమాలోని ఓ సీన్‌ను వాడుకున్నట్లు టాక్ ఉంది. కేజీఎఫ్‌ సినిమా మొదటి భాగం క్లైమాక్స్‌లో పెద్ద దేవత విగ్రహం ముందు రాకీ భాయ్ గరుడ తల నరికి చంపే సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ఆ సీన్ స్ఫూర్తితో సలార్​లో కూడా అలాంటి సీన్ క్రియేట్ చేశారట.

Salaar Interval Scene : సలార్ ఇంటర్వెల్ సీన్‌లో కాళీమాత పెద్ద విగ్రహం ముందు ప్రభాస్ విలన్‌లతో పోరాడే సన్నివేశం ఉందని అంటున్నారు. ఆ ఫైట్ సీన్ ద్వారానే ప్రభాస్, విలన్ల మధ్య మొదటి ఫైట్ జరుగుతుందట. ఆ ఫైట్ ద్వారానే విలన్ల దృష్టి అంతా ప్రభాస్ క్యారెక్టర్ వైపు మళ్లుతుందని అంటున్నారు. ఈ సన్నివేశాన్ని ఇంటర్వెల్ బ్యాంగ్‌గా కూడా ఉపయోగించారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Salaar Prabhas : ఇంటర్నేషనల్​ మాఫియాతో ప్రభాస్​​ బిగ్​ ఫైట్​.. ఫ్యాన్స్​కు పూనకాలే!

Salaar English Version : 'స‌లార్' ఇంగ్లీష్ వెర్ష‌న్ కోసం స్పెష‌ల్ ప్లాన్స్‌.. అక్టోబ‌ర్‌లో రిలీజ్‌?

Last Updated : Aug 9, 2023, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.