ETV Bharat / entertainment

'సైంధ‌వ్‌' రివ్యూ - వెంకటేశ్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే? - సైంధవ్​ మూవీ రివ్యూ

Saindhav Movie Review : ఈ సంక్రాంతికి వచ్చిన విక్టరీ వెంకటేశ్‌ సైంధవ్‌ సినిమా ఎలా ఉందంటే?

సైంధ‌వ్‌ రివ్యూ - వెంకటేశ్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 1:30 PM IST

Updated : Jan 13, 2024, 1:44 PM IST

Saindhav Movie Review : ఈ సంక్రాంతి బరిలో ఇప్పటికే శుక్ర‌వారం చిన్నోడు మ‌హేశ్ గుంటూరు కారంతో రాగా శ‌నివారం(జనవరి 13) పెద్దోడు వెంక‌టేశ్ సైంధ‌వ్‌తో వచ్చారు. వెంక‌టేశ్​కు ఇది 75వ సినిమా. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం..

Saindhav Movie Story క‌థేంటంటే : చంద్ర‌ప్ర‌స్థ అనే న‌గ‌రం నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంది. సైంధ‌వ్ కోనేరు అలియాస్ సైకో (వెంక‌టేశ్‌)కు తన కూతురంటే గాయ‌త్రి (బేబి సారా) ప్రాణం. వీరికి భ‌ర్త నుంచి విడిపోయిన మ‌నో (శ్ర‌ద్ధ శ్రీనాథ్‌)తో మంచి అనుబంధం ఏర్ప‌డుతుంది. గ‌తంలో కార్టెల్ సంస్థ‌లో ప‌నిచేసిన సైంధవ్​ పెళ్లి త‌ర్వాత భార్య‌కు ఇచ్చిన మాట కోసం అక్క‌డ ప‌ని చేయ‌డం మానేసి కూతురే ప్ర‌పంచంగా బ‌తుకుతుంటాడు. ఇంత‌లో 'స్పైన‌ల్ మ‌స్కుల‌ర్ అట్రోఫీ' అనే జ‌బ్బు బారిన పడుతుంది సైంధవ్ కూతురు. ఆ జ‌బ్బు నుంచి బ‌య‌ట ప‌డాలంటే రూ.17 కోట్ల విలువ చేసే ఇంజెక్ష‌న్ కావాలి. మరి అంత డ‌బ్బును సైంధవ్​ ఎలా సంపాదించాడు? త‌న బిడ్డ ప్రాణాల్ని కాపాడుకున్నాడా లేదా? చిన్న పిల్ల‌ల అక్రమ రవాణాతో పాటు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసే కార్టెల్ సంస్థ నడుపుతున్న వికాస్ మాలిక్​తో (న‌వాజుద్దీన్ సిద్ధిఖీ), మిత్ర (ముఖేష్ రుషి) సైంధ‌వ్ పోరాటం ఎలా సాగింది? అనేదే కథ.

ఎలా ఉందంటే? వెంకటేశ్​ను దర్శకుడు చూపించిన విధానం బాగుంది. అయితే తన గ‌త చిత్రాల్లో అడుగ‌డుగునా ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేసే సీన్స్​ను తీసే​ శైలేష్ కొల‌ను 'సైంధ‌వ్‌' విష‌యంలో అలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. క‌థ వ‌ర‌కూ బాగానే ఉన్నా క‌థనం సాదాసీదాగా ఉంది. దీంతో ఏ ద‌శ‌లోనూ సినిమా అంతగా ర‌క్తి క‌ట్ట‌లేదు. కేవ‌లం యాక్ష‌న్ ఎపిసోడ్లతోనే సినిమాను న‌డిపించడం వల్ల ఆస‌క్తిగా అనిపించ‌దు. దీంతో ఎమోషన్స్​ బ‌లంగా పండ‌లేదు. వెంక‌టేశ్ చేసిన యాక్ష‌న్ సీన్స్​, ఆయ‌న స్టైలిష్ లుక్, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర తప్ప చెప్పుకోద‌గ్గ అంశ‌మేదీ లేదు. క‌నిపించ‌దు. సినిమా ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ అన్నీ కాల్పుల మోతే. చాలా పాత్ర‌లు అసంపూర్ణంగా కనిపించాయి. క్లైమాక్స్​ స‌న్నివేశాలు మ‌రీ సాదాసీదాగా ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎవ‌రెలా చేశారంటే? వెంకటేశ్​ యాక్ష‌న్ బాగుంది. మ‌రింత స్టైలిష్‌గా క‌నిపించారు. ఎమోషన్ సీన్స్​ త‌న‌దైన ముద్ర వేశారు. ఆ త‌ర్వాత చెప్పుకోవాల్సింది న‌వాజుద్దీన్ సిద్ధిఖీ గురించే. ఆయ‌న పాత్ర‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. గ‌మ్మ‌త్తుగా క‌నిపిస్తూనే భ‌య‌పెడుతుంటాడు. హిందీలోనే ఎక్కువ డైలాగ్స్​ ఉంటాయి. తెలుగులో డైలాగులు చెప్పించి ఉంటే ప్ర‌భావం మ‌రింత‌గా ఉండేది. ఇక శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శ‌ర్మ‌, ఆండ్రియా, జ‌య‌ప్ర‌కాశ్, ముఖేష్ రుషి త‌దిత‌రులు తమ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

టెక్నికల్ విషయానికొస్తే కెమెరా పనితనం బాగుంది. మ‌ణికంద‌న్ ఇంద్ర‌ప్ర‌స్థ నేప‌థ్యాన్ని చూపించిన తీరు ఆక‌ట్టుకునేలా ఉంది. సంతోష్ నారాయ‌ణ‌న్ సాంగ్స్​, బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​, అవినాష్ కొల్లా ప్రొడ‌క్ష‌న్ డిజైన్ సినిమాకు అట్రాక్షన్​గా నిలిచాయి. ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ర‌చ‌న‌లోనే లోటు కనిపించింది.

ఫైనల్​గా వెంక‌టేశ్ న‌ట‌న‌, యాక్ష‌న్ స‌న్నివేశాలు, న‌వాజుద్దీన్ పాత్ర‌ సినిమాకు ప్లస్​. ఆక‌ట్టుకోని క‌థ‌నం, కొర‌వ‌డిన భావోద్వేగాలు సినిమాకు మైనస్​. ఒక్కమాటలో చెప్పాలంటే సైంధ‌వ్‌. వెంకీ యాక్ష‌న్ అవతారం.

సైంధవ్ బ్యూటీ - ఈ లాయరమ్మ సో బ్యూటీఫుల్​

వెంకీ మామ నట విశ్వరూపం - 'సైంధవ్' ఎలా ఉందంటే?

Last Updated : Jan 13, 2024, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.