Sai Pallavi Marriage : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పెళ్లిపై అనేక రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలే కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ పెళ్లంటూ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో కీర్తి సురేశ్ తండ్రి సురేశ్ కుమార్ స్పందించి అవేవి నిజం కాదంటూ ఖండించారు. అయితే తాజాగా మరో నటిపై పెళ్లి రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కోలీవుడ్ నటి సాయి పల్లవికి తమిళ దర్శకుడికి వివాహం అంటూ కొందరు నెటిజన్లు ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే, ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?
ఆ ఒక్క ఫొటో వల్ల..
Sai Pallavi SK 21 Movie : తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి సాయి పల్లవి 'SK21' అనే సినిమాలో కనిపించనున్నారు. దీనికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. అందులో భాగంగా చిత్రబృందంతో పాటు సాయిపల్లవి, దర్శకుడు కూడా మెడలో దండలు వేసుకుని ఫొటోలు దిగారు. అయితే ఈ ఫొటోను కొందరు నెటిజన్లు సగం వరకు క్రాప్ చేసి.. ఆమె పెళ్లి అంటూ నెట్టింట రూమర్స్ సృష్టించారు. దీంతో ఓవర్‌నైట్‌లో ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అయితే ఇదే విషయంపై 'విరాటపర్వం' దర్శకుడు వేణు ఊడుగుల తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆ ఫొటోను సినిమా ప్రారంభం సందర్భంగా తీయించుకున్నట్లు తెలుపుతూ ఓ పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇటువంటి ఫేక్ న్యూస్‌ను ట్రెండ్ చేసేవాళ్ల పని పట్టాలంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
గతంలో కీర్తి సురేశ్ కూడా ఇటువంటి రూమర్స్‌ను చాలా సార్లు ఎదుర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో ఆమె ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్లు కొన్నాళ్ల క్రితమే పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు, నెట్టింట పోస్ట్‌లు తెగ ట్రెండ్ అయ్యాయి. ఇక దానిపై కీర్తి కూడా స్పదించారు. " నా పెళ్లి గురించి వస్తోన్న వార్తలు, పోస్ట్‌లు చూసి నేను షాకయ్యాను. కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే, మూడు, నాలుగు సార్లు నాకు పెళ్లి చేసేశారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటాను" అని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా తన స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. 'కీర్తికి కాబోయే వరుడు ఇతడే' అంటూ మరో సారి ఆ ఫొటోను ట్రెండ్ చేశారు. దీంతో విస్తుపోయిన కీర్తి కుటుంబ సభ్యులు నెట్టింట పలు మార్లు క్లారిటీ ఇచ్చిన సందర్భాలున్నాయి.
-
The picture that is circulating on social media platforms is from Saipallavi's new movie #SK21 POOJA OPENING CEREMONY PIC!#SaiPallavi @Sai_Pallavi92 pic.twitter.com/N8SWTiojCA
— Sai Pallavi FC™ (@SaipallaviFC) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The picture that is circulating on social media platforms is from Saipallavi's new movie #SK21 POOJA OPENING CEREMONY PIC!#SaiPallavi @Sai_Pallavi92 pic.twitter.com/N8SWTiojCA
— Sai Pallavi FC™ (@SaipallaviFC) September 20, 2023The picture that is circulating on social media platforms is from Saipallavi's new movie #SK21 POOJA OPENING CEREMONY PIC!#SaiPallavi @Sai_Pallavi92 pic.twitter.com/N8SWTiojCA
— Sai Pallavi FC™ (@SaipallaviFC) September 20, 2023
Keerthy Suresh Marriage : ఆ మ్యూజిక్ డైరెక్టర్‌తో కీర్తి సురేశ్ పెళ్లి.. నటి తండ్రి క్లారిటీ