ETV Bharat / entertainment

'బాహుబలి 2'ను బీట్ చేసిన RRR.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా.. - RRR latst updates

జపాన్‌లో 300 మిలియన్ యెన్‌లు సాధించిన సినిమాల జాబితాలో 'ఆర్​ఆర్​ఆర్'​ చేరిపోయింది. అంతేకాదు, 300 మిలియన్ మార్కును అత్యంత వేగంగా అందుకున్న ఇండియన్ సినిమాగా 'ఆర్​ఆర్​ఆర్'​ రికార్డు నెలకొల్పింది. ఆ సంగతులు..

rrr bahubali
rrr bahubali
author img

By

Published : Nov 26, 2022, 9:51 AM IST

జపనీస్ భాషలోకి అనువాదమయ్యే ఇండియన్ మూవీస్‌ను చూసే అలవాటు జపాన్‌లోని సినీ ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ఉంది. రజినీకాంత్ హీరోగా వచ్చిన 'ముత్తు' సినిమాను జపనీస్ ఆడియన్స్ ఇరగబడి చూశారు. ఆ తరువాత మళ్లీ అంతటి ఆదరణ పొందిన చిత్రం 'బాహుబలి 2'. ఈ సినిమాతో ప్రభాస్, రానా, రాజమౌళి పేర్లు జపాన్‌లో మారుమోగిపోయాయి. అయితే, అదే దర్శకుడి నుంచి వచ్చిన మరో అద్భుతమైన సినిమా 'ఆర్​ఆర్​ఆర్'​పై కూడా జపాన్ ప్రేక్షకులు విపరీతమైన ఆదరణ చూపిస్తున్నారు. 'బాహుబలి 2'ను మించి 'ఆర్ఆర్​ఆర్'​ను ఇరగబడి చూసేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా.. జపాన్‌లో అక్టోబర్ 21న విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లో అత్యధికంగా వసూలు చేసిన రెండో ఇండియన్ ఫిల్మ్​గా నిలిచింది. 'బాహుబలి 2' బాక్సాఫీస్​ కలెక్షన్‌ను 'ఆర్​ఆర్​ఆర్'​ బీట్ చేసింది. జపాన్ వ్యాప్తంగా 209 స్క్రీన్స్, 31 ఐమ్యాక్స్ స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా.. అక్కడ అత్యంత వేగంగా 300 మిలియన్ జపనీస్ యెన్‌లు వసూలు చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. విడుదలైన 34 రోజుల్లో 305 మిలియన్ జపనీస్ యెన్‌లు రాబట్టింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.17.9 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఈ 34 రోజుల్లో 2,03,867 మంది ఆర్​ఆర్​ఆర్​ సినిమాను చూశారు.

ఇప్పటి వరకు 300 మిలియన్ యెన్‌ల కలెక్షన్‌తో జపాన్‌లో 'బాహుబలి 2' రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు 305 మిలియన్ యెన్‌లతో రెండో స్థానాన్ని 'ఆర్​ఆర్​ఆర్' కైవలం చేసుకుంది​. అంతేకాదు, అగ్రస్థానంపై కూడా కన్నేసింది. ప్రస్తుతం అగ్రస్థానంలో రజినీకాంత్ ముత్తు సినిమా ఉంది. ఈ చిత్రం ఏడాది పాటు జపాన్‌లో ప్రదర్శితమై 400 మిలియన్ యెన్‌లు వసూలు చేసింది. అంటే, సుమారు రూ.23.5 కోట్లు.

అయితే, 'ఆర్​ఆర్​ఆర్'​ జపాన్‌లో ఇంత ఎక్కువ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి 2తో రాజమౌళికి ఏర్పడిన ఇమేజ్ 'ఆర్​ఆర్​ఆర్'​పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్​చరణ్ స్వయంగా జపాన్ వెళ్లి ప్రచారం చేయడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.

34 రోజుల్లోనే 300 మిలియన్ యెన్‌లు 'ఆర్​ఆర్​ఆర్'​ రాబట్టింది. కాబట్టి, మరో 100 మిలియన్ యెన్‌లు ఈ సినిమాకు కష్టం కాదు. జపాన్‌లో సినిమాలు సుధీర్ఘ కాలంపాటు థియేటర్లలో ప్రదర్శితమవుతాయి. 'బాహుబలి 2' కూడా 6 నెలలు ఆడింది. కాబట్టి, 'ఆర్​ఆర్​ఆర్'​ జపాన్‌లో అత్యధికంగా వసూలు చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం గట్టిగా కలుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.