ETV Bharat / entertainment

విజయ్​-సామ్ ఫ్యాన్స్​కు ట్రీట్​.. 'ఖుషి' ఫస్ట్ లిరికల్ ప్రోమో రిలీజ్​!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఓ తాజా అప్డేట్​ రిలీజైంది. అదేంటంటే..

vijay-devarakonda-samantha-kushi-first-lyrical-promo
vijay devarakonda samantha
author img

By

Published : May 7, 2023, 1:36 PM IST

Updated : May 7, 2023, 2:51 PM IST

'లైగర్'​ పరాజయం తర్వాత కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారు రౌడీ హీరో విజయ దేవరకొండ. ప్రస్తుతం సమంతతో కలిసి ఆయన 'ఖుషి' అనే సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. ఈ క్రమంలో సినిమా నుంచి ఓ లేటెస్ట్​ అప్డేట్​ను అనౌన్స్​ చేసింది మూవీ టీమ్​. ఈ సినిమా నుంచి రానున్న ఫస్ట్ లిరికల్​ సింగిల్​కు సంబంధించిన ప్రోమోను ఆదివారం విడుదల చేసింది. ఓ చిన్న ట్యూన్​తో పాటు విజయ్ సమంత ఫొటోలతో ఉన్న ఆ వీడియో ఇప్పుడు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేపుతోంది. అయితే ఫుల్​ సాంగ్​ మాత్రం ఈనెల 9న విడుదల కానుందని మేకర్స్​ వెల్లడించారు. మ్యూజిక్​ డైరెక్టర్​ హీషమ్ అబ్దుల్ ఇచ్చిన మ్యాజికల్​ ట్యూన్​ ఈ ప్రోమోకు హైలైట్​గా ఉందని అభిమానులు అంటున్నారు.

కాగా ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. అప్పట్లో సమంత అనారోగ్య కారణాల వల్ల ఈ షూటింగ్​ మధ్యలోనే షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ మార్చి 8 నుంచి ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సచిన్ ఖడేకర్, అలీ, జయరామ్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను కేవలం తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది.

ఇప్పటికే విడుదలైన 'ఖుషి' ఫస్ట్ లుక్​తో పాటు మోషన్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సామ్​ విజయ్​ చాలా బాగున్నారంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్​లో భారీ అంచనాలు పెరిగాయి. అంతే కాకుండా అప్పట్లో ఇదే 'ఖుషీ' టైటిల్​తో వచ్చిన పవన్​ మూవీ సైతం సెన్సేషన్ సృష్టించింది. దీంతో మరోసారి ఇదే మ్యాజిక్​ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

మరోవైపు విజయ్ దేవరకొండ తన పన్నెండో సినిమా కోసం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరిని దర్శకుడిగా ఎంచుకున్నారు. వీడీ 12 అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్​ కూడా తాజాగా ప్రారంభమవ్వనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అంతే కాకుండా తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో కూడా ఓ సినిమాకు ఓకే చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : May 7, 2023, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.