Re Release Movies Telugu 2023 : ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రీరిలీజ్ ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. బాక్సాఫీస్ వద్ద ఇవి మంచి రికార్డ్ వసూళ్లను కూడా అందుకుంటున్నాయి(re release tollywood collections). వీటికి బాగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ప్రతివారం కొత్త సినిమాలతో పాటు ఇవి కూడా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అంతకుముందు ఆయా హీరోల పుట్టినరోజు నాడు లేదా ఏమైన ఇతర ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వీటిని విడుదల చేసేవారు. ఇప్పుడు సమయం సందర్భం లేకుండా కలెక్షన్లను దండుకోవడమే లక్ష్యంగా వాటిని అభిమానం పేరుతో థియేటర్లలోకి తోసేస్తున్నారు.
అయితే ఈ వ్యాపారం ఓ వైపు లాభాలు తెస్తున్నప్పటికీ నష్టాలు కూడా తెస్తుంది అన్న వాదనలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు చిత్రసీమలో ఓ పెద్ద సమస్యకు దారీ తీసేలా కనిపిస్తోంది. దీనిపై తీవ్రంగా చర్చలు మొదలవుతున్నాయి. ఈ పాత చిత్రాల రిలీజ్ చేసే సమయాలను మార్చుకోవాలని కొత్త చిత్రాలను రిలీజ్ చేసే నిర్మాతలు కోరుతున్నారు. వీకెండ్లో కొత్త సినిమాలతో పాటు వీడిని విడుదల చేయడం వల్ల.. తమకు నష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. నాన్ వీకెండ్ డేస్‌లో వాటిని రిలీజ్ చేయాలని అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో పాత సినిమాల ప్రొడ్యూసర్స్ ఏమాత్రం తగ్గట్లేదు. డిమాండ్ ఉన్న నేఫథ్యంలో రైట్స్‌కు భారీ ధరకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ రేట్లు చెబుతూ డిస్ట్రిబ్యూటర్లకు బిగ్ షాక్ ఇస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాస్ ఎంబీబీఎస్(shankar dada mbbs release date) సినిమా రైట్స్ రూ.2కోట్లు, నాగచైతన్య-సమంత 'ఏమాయ చేశావే'(ye maaya chesave re release) హక్కులు రూ.1కోటి అని తెలిసింది. అంత మొత్తంలో ధరలు చెప్పడం సరికాదంటూ డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రీరిలీజ్ ట్రెండ్ సమస్య కాంట్రవర్సీగా మారకముందే.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ సమస్యకు పరిష్కారం చూసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..
భూమిక హ్యాట్రిక్.. రీరిలీజ్ ట్రెండ్‌లో ఆమెదే పైచేయి.. వరుసగా మూడు చిత్రాలు..