ETV Bharat / entertainment

Ravi Teja New Movie RT4GM : రవితేజ - గోపిచంద్ కాంబో రిపీట్.. కీలక పాత్రలో ఆ డైరెక్టర్​ ఫిక్స్ - రవితేజ కొత్త సినిమా

Ravi Teja new Movie RT4GM : స్టార్ హీరో రవితేజ - గోపిచంద్ మలినేని కాంబినేషన్.. టాలీవుడ్​లో హిట్ జోడీగా పేరొందింది. ఇప్పటికే ఈ కాంబో నుంచి 'డాన్ శ్రీను', 'బలుపు' 'క్రాక్​' రాగా.. ఇప్పుడు మరో సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓప్​డేట్స్​ ఇచ్చారు మూవీమేకర్స్.

Ravi Teja new Movie RT4GM
Ravi Teja new Movie RT4GM
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 10:01 PM IST

Ravi Teja new Movie RT4GM : కొన్ని కాంబినేషన్లు వెండితెరపైకి వస్తున్నాయంటే ఆ సినిమాలకు క్రేజ్​ మామూలుగా ఉండదు. ఇక షూటింగ్ మొదలుకొని.. థియేటర్లలో రిలీజ్​ అయ్యేవరకు ఆ సినిమా గురించే చర్చ నడుస్తుంటుంది. మాస్​ రాజా రవితేజ- గోపిచంద్ కాంబినేషన్ కూడా అచ్చం అలాంటిదే. ఈ కాంబోలో ఇప్పటికే 'డాన్ శ్రీను', 'బలుపు' 'క్రాక్​' సినిమాలు విడుదలై.. బ్లాక్​బస్టర్​లుగా నిలిచాయి. అయితే ఈ ఇద్దరు మళ్లీ జతకట్టనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై.. నవీన్​ యేర్నేని, రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇక వీరి కాంబోలో రానున్న సినిమాకు 'ఆర్​టీ4జీఎమ్' అనే పేరుతో​ వర్కింగ్​ టైటిల్ టైటిల్ కన్ఫార్మ్ చేస్తూ.. బుధవారం మరో అప్​డేట్ ఇచ్చారు. అదేంటంటే?

Selvaraghavan in RT4GM.. ఈ సినిమాలో తమిళ దర్శకుడు సెల్వరాఘవన్​ కీలక పాత్రలో నటించనున్నట్లు మూవీమేకర్స్​ ట్విట్టర్​లో వెల్లడించారు. కొన్నేళ్ల పాటు ప్రేక్షకులందరికి గుర్తుండిపోయే విధంగా ఆయన పాత్ర ఉంటుందని తెలిపారు. ఇక సెల్వ రాఘవన్​తో పాటు నటి ఇందుజా రవిచంద్రన్, డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర, ఎడిటర్​గా నవీన్ నూలి , సినిమాటోగ్రఫీ జీకే విష్ణు ఈ ప్రాజెక్ట్​లో చేరనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా.. వెల్లడించారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.

క్రాక్​ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావటం వల్ల ఫ్యాన్స్ హై ఎక్స్​పెక్టేషన్స్ పెట్టుకున్నారు. 'క్రాక్' రవితేజ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. క్రాక్​తో మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. కొవిడ్ టైమ్​లో కూడా ప్రేక్షకును ఈ సినిమా థియేటర్ల వరకు రప్పించింది. ఓ సిన్సియర్ పోలీస్ పాత్రలో రవితేజ ఈ సినిమాలో అదరగొట్టారు. మరి తాజా ప్రాజెక్ట్‌ రవితేజ స్టార్‌డమ్‌ ఏ రేంజ్‌కు పెంచుతుందో చూడాలి. దసరా కానుకగా రవితేజ 'టైగర్‌ నాగేశ్వర రావు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానకి మిశ్రమ స్పందన లభించింది.

Ravi Teja Silpa shetty : మాస్ మహారాజాతో శిల్పాశెట్టి డ్యాన్స్​.. స్టెప్పులు అదిరిపోయాయి బాసూ!

Balakrishna vs Raviteja : ఈ సారి కథ మారింది సారూ.. 'టైగర్​ నాగేశ్వరరాపు' కన్నా 'భగవంత్​ కేసరే' మోత మోగిస్తున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.