ETV Bharat / entertainment

'నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు.. స్టూడియోలో ఫ్లోర్స్ క్లీన్‌ చేశా' - రవీనాా టెండన్​ విషయాలు

Raveena Tandon: తాను నటిగా కెరీర్‌ ప్రారంభించడానికంటే ముందు స్టూడియోలో ఫ్లోర్స్ శుభ్రం చేశానని చెప్పారు బాలీవుడ్​ నటి రవీనా టాండన్​. ఇటీవలే విడుదలైన 'కేజీయఫ్​ 2' సినిమాలో రమికా సేన్​గా నటించి మెప్పించిన ఆమె.. తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తెలిపారు. అవి ఆమె మాటల్లోనే..

రవీనా టాండన్
రవీనా టాండన్
author img

By

Published : Apr 23, 2022, 4:03 PM IST

Updated : Apr 23, 2022, 4:11 PM IST

Raveena Tandon: 'కేజీయఫ్‌-2'లో రమికా సేన్‌గా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించిన బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవీనా.. అతి తక్కువ సమయంలోనే వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం 'కేజీయఫ్‌-2' విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఎప్పుడూ నటి కావాలని భావించలేదని, అనుకోకుండా ఈ రంగంలోకి అడుగుపెట్టానని అన్నారు. నటిగా కెరీర్‌ ప్రారంభించడానికంటే ముందు తాను స్టూడియోలో ఫ్లోర్స్ శుభ్రం చేశానని చెప్పారు.

రవీనా టాండన్
రవీనా టాండన్

"నేను నిజమే చెబుతున్నా. నటిగా కెరీర్‌ ప్రారంభించడానికంటే ముందు ప్రహ్లాద్‌కు అసిస్టెంట్‌గా పనిచేశాను. స్టూడియోలో ఫ్లోర్‌ క్లీన్‌ చేసేదాన్ని. 'నువ్వు స్క్రీన్‌ వెనుక కాదు. స్క్రీన్‌పై నటించాలి. యాక్టింగ్‌కి నీ ఫేస్‌ సరిగ్గా నప్పుతుంది' అని అక్కడ వాళ్లందరూ చెప్పేవాళ్లు. వాళ్ల మాటలు విని నవ్వుకునేదాన్ని. 'నేనా? నటినా?నాకస్సలు ఆ ఉద్దేశమే లేదు' అని సమాధానమిచ్చా. కొన్ని రోజుల తర్వాత పాకెట్ మనీ కోసం ప్రహ్లాద్‌ వద్ద మోడల్‌గా వర్క్‌ చేశా. అలా, నేను మోడలింగ్‌లోకి రావడం.. అక్కడ మంచి పేరు సొంతం చేసుకున్న సినిమాల్లో అవకాశాలు రావడంతో నటిగా మారాల్సి వచ్చింది." అని రవీనా వివరించారు.

ఇవీ చదవండి: పుష్ప- 2 షూటింగ్​ మరింత ఆలస్యం..​ కారణం అదేనా?

బాధగా ఉంది.. మేము ఏ తప్పు చేయలేదు: జీవిత

Last Updated : Apr 23, 2022, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.