సామాజిక మాధ్యమాల్లో నగ్న ఫొటోలు పోస్ట్ చేసిన వ్యవహారంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్‌కు పోలీసులు కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఆగస్టు 29న పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. అతడి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అయితే తాజాగా ఆ స్టేట్మెంట్లో రణ్‌వీర్ ఏం చెప్పాడో పోలీసులు వెల్లడించారు. ఈ న్యూడ్ ఫొటోస్ ఓ ట్విస్ట్ చోటు చేసుకుందని అన్నారు.
తాను పోస్ట్ చేసిన నగ్న ఫొటోల్లో ఒకటి మార్ఫింగ్ చేశారని రణ్‌వీర్ చెప్పారట. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. తాను పోస్ట్ చేసిన ఆ న్యూడ్ ఫొటోలో అండర్వేర్ వేసుకున్నట్లు రణ్‌వీర్ చెప్పినట్లు వెల్లడించారు. ఆ ఫొటో మార్ఫింగ్ చేశారని పోలీసులతో రణ్‌వీర్ చెప్పారట! అయితే దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ఫొటో మార్ఫింగ్ అయిందా లేదా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు.
కాగా, రణ్‌వీర్ తన నగ్న ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు వారిని అవమానపరిచారంటూ ఓ ఎన్ జీవో పాటు ఓ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు కేసు నమోదు చేసి రణ్వీర్ను విచారణకు పిలిచి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఒకే టైటిల్‌తో ఎన్టీఆర్-నాగార్జున సినిమా.. ఏది హిట్ అయిందంటే?