Rangabali Movie Review : తెలుగు ప్రేక్షకుల్లో లవర్‌బాయ్‌గా గుర్తింపు పొందిన నాగశౌర్య, యంగ్ బ్యూటీ యుక్తి తరేజా జంటగా నటించిన తాజా చిత్రం 'రంగబలి'. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే చాలా రోజుల నుంచి హిట్ సినిమాలు లేని నాగశౌర్య.. ఈ సినిమాతో ఆడియెన్స్‌ను మెప్పించారు. కథలో ఫస్ట్‌హాఫ్ సరదాగా సాగుతుంది. ఇక సెకెండ్ హాఫ్ మొదలవగానే స్టోరీ ఒక్కసారిగా సీరియస్ మూడ్‌లోకి మారిపోతుంది. 'రంగబలి' సెంటర్ పేరు మార్చడం కోసం శౌర్య చేసే కొన్ని ప్రయత్నాలు థియేటర్లలో నవ్వులు పంచాయి. కానీ మరికొన్ని ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి.
అయితే పేరు మార్చాలనే క్రమంలో హీరోకు ఊరి ఎమ్మెల్యేకు మధ్య వార్ మొదలవ్వడం వల్ల కథ కాస్త రసవత్తరంగా మారుతుంది. అయితే రంగబలి సెంటర్ వెనకున్న అసలు కథ కాస్త రొటీన్‌గానే అనిపించినా, నటుడు శరత్‌కుమార్ వల్ల ఆ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో జోష్ నింపుతుంది. ఆ కథను శౌర్య జీవితంతో ముడిపెట్టిన తీరు బాగుంది. చివరగా కాలక్షేపాన్నిచ్చే ‘రంగబలి' అంటూ సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
Rangabali Movie Heroine : పక్కింటి కుర్రాడి పాత్రల్లో నటించడం నాగశౌర్యకు కొత్తేం కాదు. రంగబలిలో కూడా అలాంటి పాత్ర కావడం వల్ల.. శౌర్య తనకున్న అనుభవంతో ఈ పాత్రలో ఇట్టే ఒదిగిపోయారు. యాక్షన్ సన్నివేశాల్లో జోరు చూపించిన శౌర్య.. పలు సీన్స్‌లో తన ఎనర్జీని చూపించి అబ్బురపరిచారు. సహజ పాత్రలో హీరోయిన్ యుక్తి న్యాచురల్‌గా కనిపించింది. కానీ వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ రొటీన్‌గా అనిపించింది. కానీ ద్వితీయార్ధంలో వచ్చే ఓ రొమాంటిక్ పాటలో యుక్తి.. గ్లామర్ బాగానే ఒలికించింది. ఎదుటివాడు సంతోషపడితే తట్టుకోలేని అగాధం అనే పాత్రలో సత్య నటన కడుపుబ్బా నవ్విస్తుంది. ఒకరకంగా ఫస్ట్ హాఫ్‌లో తనే హీరో. అలాగే జాకెట్లు కుట్టే టైలర్ రాజ్‌కుమార్ పాత్ర కూడా అక్కడక్కడా నవ్వులు పూయిస్తుంది.
ప్రతినాయకుడిగా షైన్ టామ్ పాత్ర ఆరంభంలో ఫర్వాలేదనిపించినా.. క్లైమాక్స్‌కు వచ్చే సరికి పేలవంగా మారిపోయింది. ఆ పాత్రకు సరైన ముగింపు ఇవ్వలేకపోయారు. కమర్షియల్ కథల్లో కామెడీని మిక్స్ చేయడం ఓ ఆర్ట్. దాన్ని దర్శకుడు పవన్ చక్కగా చేసి చూపారు. అయితే అసలు కథ మొదలయ్యాక తను కాస్త గాడితప్పినట్టు అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ను ఆకట్టుకునేలా రూపొందించలేకపోయారు.
Rangabali Nagashaurya : సరదాగ సాగే ఫ్యామిలీ, రొమాంటిక్, ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లైనా నాగశౌర్యకు చక్కగా సరిపోతాయి. ఈ తరహా సినిమాలతోనే నాగశౌర్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ సారి ఓ కొత్త జానర్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ అవి అనుకున్న రీతిలో సక్సెస్ అవ్వలేదు. అందుకని ఈ సినిమా హిట్ కొట్టాలని భావించిన నాగశౌర్య.. కొత్త డైరెక్టర్ పవన్ బాసంశెట్టితో కలిసి 'రంగబలి'ని చేశారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా 'రంగబలి' పై అంచనాలు పెంచింది.
Rangabali Cast : ఈ సినిమాలో గోపరాజు రమణ, షైన్ టామ్ చాకో, సత్య, శరత్ కుమార్, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, అనంత్ శ్రీరామ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రమ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు ఆయా పాత్రల్లో అలరించారు. పవన్ బాసంశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. పవన్ సి.హెచ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. కాగా సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బలాలు
- + కథా నేపథ్యం
- + నాగశౌర్య నటన, యాక్షన్
- + సత్య కామెడీ
- బలహీనతలు
- - ద్వితీయార్ధం, పాటలు
- - పతాక సన్నివేశాలు
- చివరిగా: కాలక్షేపాన్నిచ్చే 'రంగబలి'
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- ఇవీ చదవండి :
- 'సామజవరగమన' బాక్సాఫీస్ జోరు.. వర్కింగ్ డేస్‌లోనూ వసూళ్లే వసూళ్లు!
- Spy Day 1 Collections : 'స్పై' ఫస్ట్ డే కలెక్షన్స్.. నిఖిల్ కెరీర్లోనే రికార్డ్.. ఎన్ని కోట్లంటే..