ETV Bharat / entertainment

రణ్​బీర్​ డ్యుయల్​ రోల్​.. కళ్లు చెదిరే పోరాట దృశ్యాలతో 'షంషేరా'

author img

By

Published : Jun 24, 2022, 3:59 PM IST

Updated : Jun 24, 2022, 6:27 PM IST

Shamshera Trailer: బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్​, వాణీకపూర్​ నటించిన షంషేరా ట్రైలర్​ విడుదలైంది. ద్విపాత్రాభినయంలో రణ్​బీర్​ ఆకట్టుకున్నారు. జులై 22న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Ranbir Kapoor Starrer Shamshera Official Trailer-out-now

Shamshera Trailer: 'స్వాతంత్ర్యం ఊరికే రాదు. పోరాడి సాధించుకోవాలంటూ దూసుకువస్తున్నారు' రణ్‌బీర్‌ కపూర్‌. ఆయన ద్విపాత్రాభినయంలో నటించిన 'షంషేరా' ట్రైలర్‌ను శుక్రవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ఓ వైపు యోధుడిగా, మరోవైపు దొంగగా రణ్‌బీర్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. ప్రతినాయకుడిగా సంజయ్‌ దత్‌ ఆహార్యం, సంభాషణలు ప్రేక్షకుల్ని మెప్పించేలా సాగాయి. కళ్లు చెదిరే పోరాట దృశ్యాలు, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
చారిత్రక కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. కరణ్‌ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా దీన్ని నిర్మించారు. వాణీకపూర్‌ కథానాయిక. జులై 22న హిందీ, తమిళం, తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమా ట్రైలర్​ విడుదలకు ముందు తన తండ్రి రిషి కపూర్​ను తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు రణ్​బీర్​. ఈ సినిమా చూడటానికి ఆయన బతికి ఉండి ఉంటే తాను ఎంతో సంతోషించేవాడనని అన్నారు. "'షంషేరా' చూసేందుకు మా నాన్న బతికి ఉంటే బాగుండు. నా పని నచ్చినా, నచ్చకపోయినా చాలా నిజాయతీగా చెప్పేవారు. ఈ సినిమా ఆయన చూడలేకపోవడం చాలా బాధగా ఉంది. కానీ, ఇలాంటి చిత్రం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడ ఉన్నా ఆయన నా పట్ల గర్వంగా ఉంటారనే భావిస్తున్నా." అని రణ్​బీర్​ తెలిపారు.

ఇవీ చూడండి: బ్యాక్​లెస్​ డ్రెస్​లో హాట్​గా జాన్వీ.. మతిపోగొట్టేస్తున్న కియారా

షారుక్‌ కోసం ఆ పాత్రలో దీపిక.. బాధలో రణ్​బీర్ కపూర్​​!

Last Updated : Jun 24, 2022, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.