ETV Bharat / entertainment

Ranbir Kapoor Ramayan Movie : రాముడి పాత్ర కోసం ఆ అలవాట్లను మార్చుకున్న రణ్‌బీర్‌.. ఏం చేశారంటే? - రామాయణ్ సినిమా కోసం ఆల్కహాల్​ మానేసిన రణ్​బీర్​

Ranbir Kapoor Ramayan Movie : బాలీవుడ్​లో తెరకెక్కుతున్న మరో రామాయణంలోని రాముడు పాత్ర కోసం రణ్‌బీర్‌ కపూర్‌ తన అలవాట్లు మార్చుకున్నారని తెలిసింది. ఇంతకీ ఆయన ఏం చేశారంటే ?

Ranbir Kapoor Ramayan Movie
Ranbir Kapoor Ramayan Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 6:12 PM IST

Ranbir Kapoor Ramayan Movie : ఆదిపురుష్ తర్వాత బాలీవుడ్​లో తెరకెక్కుతున్న మరో రామాయణంపై అందరి దృష్టి పడింది. దర్శకుడు నితేశ్‌ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ రామాయాణం గురించి రోజూ ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని తారాగణంపై ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ నటించడం దాదాపుగా ఖాయమైనట్లే తెలుస్తోంది. ఈ హీరో అయితేనే రాముడి పాత్రకు సరైన న్యాయం చేయగలరంటూ ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ అగ్ర నటులు కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో రణ్​బీర్​ కూడా రాముడి పాత్ర కోసం కొన్ని అలవాట్లను మార్చుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఆయన మాంసాహారం, మద్యపానం మానేయాలని నిర్ణయించుకున్నారట. అలాగే ఈ సినిమాకు పనిచేయనున్న మూవీ టీమ్​ మొత్తం ఇలాంటి కొన్ని నియమాలు పాటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బాలీవుడ్‌ మీడియాలో ప్రత్యేక కథనాలు సైతం వెలువడుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలో సీత పాత్ర కోసం కోలీవుడ్​ హీరోయిన్​ సాయి పల్లవిని.. దర్శకుడు నితేశ్‌ తివారీ టీమ్‌ సంప్రదించారట. ఇక ఈ పాత్రలో నటించేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఆమెకు లుక్‌ టెస్ట్‌ కూడా నిర్వహించనున్నారని టాక్​ నడుస్తోంది.

Yash In Ramayan Movie : మరోవైపు రావణుడిగా హీరో యశ్​ రోల్​ విషయంలోనూ అనేక సందేహాలు మొదలయ్యాయి. మొదట్లో ఆయన పేరు కన్ఫామ్ అయినప్పటికీ.. ఆ తర్వాత ఆయన ఈ సినిమా చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రావణాసురుడిగా నటించేందుకు తాజాగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఫస్ట్ పార్ట్ కోసం పదిహేను రోజులు కాల్ షీట్స్ ఇచ్చారని.. రెండో భాగంలో ఎక్కువ డేట్స్ ఇచ్చేలా అంగీకారం కుదిరిందని టాక్​ నడుస్తోంది. నితీశ్​ తెరకెక్కిస్తున్న రామాయణంలో దశకంఠుడి ఎంట్రీని క్లైమాక్స్​లో చూపించి.. ఆ తర్వాత తెరకెక్కనున్న సీక్వెల్​లో యష్ మీద ఎక్కువ కథ నడిచేలా కథను రాసుకున్నట్టు వినికిడి. దీంతో ఈ విషయం ఓ మేర క్లారిటీ వచ్చింది. కానీ ఈ అప్​డేట్​లపై మూవీ టీమ్​ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఇచ్చేవరకు మనం ఏ విషయంపై అంచనా వేయలేమని ఫ్యాన్స్​ భావిస్తున్నారు.

యశ్​ యూ టర్న్​.. రూ.1500కోట్ల ప్రాజెక్ట్​ లుక్​ టెస్ట్​కు రెడీ!

Ramayan 2023 Cast : హిందీ రామాయణంలో సాయి పల్లవి ? సీత క్యారెక్టర్​లో మెప్పించనున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.