ETV Bharat / entertainment

ముంబయిలో చెర్రీ ఫ్యామిలీ- క్లీంకారకు కరీన బిగ్ హెల్ప్!- బాలీవుడ్ ఎంట్రీ ఫిక్సా? - రామ్​చరణ్​ క్లీంకార పిక్

Ramcharan Mumbai Trip : టాలీవుడ్ స్టార్ హీరో రామ్​చరణ్ ఫ్యామిలీ ముంబయిలో గడుపుతోంది. దీంతో వీరి ముంబయి ట్రిప్​కు ప్లాన్ ఏంటని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. మరోవైపు, ముంబయిలో ఉన్న చరణ్​ గారాలపట్టి క్లీంకారకు కరీనా బిగ్ హెల్ప్ చేసిందట!

Ramcharan Mumbai Trip
Ramcharan Mumbai Trip
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 12:56 PM IST

Updated : Dec 16, 2023, 1:58 PM IST

Ramcharan Mumbai Trip : సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫొటోగ్రాఫర్లు తెగ క్లిక్​లు అనిపిస్తారు. ఫొటోలు తీసేసి వైరల్ చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్​చరణ్ విషయంలో అదే జరిగింది. గత నాలుగురోజులుగా ముంబయిలో చరణ్ తెగ చక్కర్లు కొడుతున్నారు. తాజాగా ఆయన సతీమణి ఉపాసన కూడా తన కుమార్తె క్లీంకారను తీసుకుని ముంబయి చేరుకుంది. దీంతో ఫ్యామిలీ ఒకే దగ్గర చేరడంతో ఫొటోగ్రాఫర్లు తన కెమెరాలకు పనిచెప్పారు. కొద్దిరోజుల పాటు రామ్​ చరణ్​ తన ఫ్యామిలీతోనే ముంబయిలోనే గడపనున్నారట.

అయితే ముంబయిలో ఉన్న రామ్​చరణ్ ఫ్యామిలీ ఫొటోలు వైరల్​గా మారాయి. క్లీంకార పుట్టిన తర్వాత ఈ ఫ్యామిలీ ఎక్కడ కనపడినా ఆ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. క్యూట్ ఫ్యామిలీ అంటూ వారి ఫొటోలు, వీడియోలకు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నారు. అయితే ఫ్యామిలీ అంతా ముంబయికు రావడం వెనుక కారణమేంటని ప్రేక్షకులు తెగ ఆలోచిస్తున్నారు.

మరోవైపు, బాలీవుడ్​లో చరణ్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ తెగ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనతో పాటు ఆర్ఆర్ఆర్​లో నటించిన జూనియర్ ఎన్టీఆర్​ బాలీవుడ్ ప్రాజెక్ట్​ను ప్రారంభించారట. దీంతో ఇప్పుడు చరణ్​ కూడా బాలీవుడ్​పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ముంబయిలో కొన్నిరోజులు ఉండడానికి కారణం కూడా అదేనని చెబుతున్నారు. కానీ వారి అభిప్రాయంలో నిజం లేదని కొందరు అంటున్నారు.

క్లీంకారకు కరీనా కుమారుడు తైమూర్ హెల్పర్ సాయం?
అయితే వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోల్లో రామ్​చరణ్‌, ఉపాసన, క్లీంకారతోపాటు మరో మహిళ కూడా కనపిస్తున్నారు. ఆ మహిళ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు తైమూర్ నానీ (కేర్ టేకర్ లేదా ఆయా) కదా అని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే అందులో ఉన్నది ఆమె కాదో తెలీదు గానీ, ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.

అయితే చెర్రీ తన ఫ్యామిలీతో ముంబయికు ఓ పర్సనల్ పని మీద వచ్చారని చరణ్ టీమ్​ మెంబర్ తెలిపారు. ఇంకా ఏ బాలీవుడ్ ప్రాజెక్ట్​ను ఆయన ఓకే చేయాలని చెప్పారు. చరణ్​ కొన్నాళ్ల పాటు ముంబయిలో ఉండాల్సి ఉందని, అందుకే ఉపాసన వచ్చారని చెప్పారు. ప్రస్తుతం రామ్​చరణ్​ గేమ్​ ఛేంజర్​ సినిమా చేస్తున్నారు. కానీ ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్సు రావడం లేదు. ఇప్పటికే అనేక సార్లు బ్రేక్ పడ్డ మూవీ, ఇప్పుడు రామ్ చరణ్ ముంబయిలో ఉండడంతో గేమ్‌ఛేంజర్​కు మళ్లీ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Last Updated : Dec 16, 2023, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.