ETV Bharat / entertainment

రజనీకాంత్​ కొత్త సినిమా టైటిల్​ ఫిక్స్​.. యశ్​తో పూజా రొమాన్స్​! - పూజా హెగ్డే

ర‌జ‌నీకాంత్ చేయ‌బోయే కొత్త సినిమా కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సన్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్​ను నిర్మాణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. మరోవైపు, క‌న్న‌డ ద‌ర్శ‌కుడు నార్త‌న్‌తో య‌శ్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టించ‌నున్నట్లు సమాచారం.

rajnikanth new movie title
rajnikanth new movie title
author img

By

Published : Jun 17, 2022, 11:59 AM IST

Rajnikanth New Movie Title: 'అన్నాత్తే' సినిమాతో గ‌త ఏడాది ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు సూపర్​స్టార్​ ర‌జ‌నీకాంత్‌. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా మిక్సడ్ టాక్​ను తెచ్చుకుంది. అయితే ర‌జ‌నీకాంత్​కు ఉన్న ఇమేజ్‌, ఫాన్ ఫాలోయింగ్​తో పాటు సినిమాపై ఉన్న అంచ‌నాల కార‌ణంగా ఓపెనింగ్స్ భారీగా వ‌చ్చాయి. 'పేట‌','ద‌ర్బార్'​ చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గానూ ప‌రాజ‌యాలుగానే నిలిచాయి. ప్రస్తుతం ఈ హ్యాట్రిక్ ఫ్లాప్‌ల నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నంలో ఉన్నారు ర‌జ‌నీకాంత్‌.

పెద్ద విజ‌యంతో అభిమానుల్లో ఆనందాన్ని నింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే యువ ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్‌కుమార్‌తో సినిమా చేయ‌బోతున్నారు. శుక్ర‌వారం.. చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్​ను రిలీజ్ చేసి అభిమానులను సర్​ప్రైజ్ చేసింది. ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్​ను ఖరారు చేశారు. పోస్టర్.. సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది.

Yash New Movie Heroine: 'కేజీయఫ్'​ సిరీస్ సినిమాల‌తో పాన్ ఇండియ‌న్ స్టార్​గా మారిపోయారు కన్నడ హీరో య‌శ్‌. బాలీవుడ్‌, టాలీవుడ్ అనే భేదం లేకుండా అన్ని భాష‌ల్లో అత‌డికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. 'కేజీయఫ్‌-2' చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా పెద్ద స‌క్సెస్ అందుకుని 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ సాధించింది. అయితే క‌న్న‌డ ద‌ర్శ‌కుడు నార్త‌న్‌తో య‌శ్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. య‌శ్‌ను దృష్టిలో పెట్టుకొని అత‌డో డిఫ‌రెంట్ యాక్ష‌న్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థ‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలిసింది. య‌శ్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఇందులో య‌శ్‌కు జోడీగా పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్ర యూనిట్ ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాతోనే పూజాహెగ్డే క‌న్న‌డ‌ నాట అరంగేట్రం చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. జులైలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం పూజా.. తెలుగులో మ‌హేశ్​బాబు-త్రివిక్ర‌మ్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

ఇవీ చదవండి: 'అవన్నీ రూమర్స్.. ప్రభాస్​ను అలాంటి పాత్రలోనే చూపిస్తా'

మహేశ్​, అల్లు అర్జున్ సినిమాలు అప్​డేట్స్​.. రంగంలోకి అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.