ETV Bharat / entertainment

Rajinikanth Meets Yogi Adityanath : యోగిని కలిసిన సూపర్​స్టార్.. నేడు అయోధ్య రామయ్య దర్శనానికి రజనీ - యోగిని కలిసిన సూపర్​స్టార్​

Rajinikanth Meets Yogi Adityanath : సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం సాయంత్రం ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నివాసానికి చేరుకున్నారు. సీఎంను కలవగానే రజనీకాంత్.. ఆయన పాదాలను తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

fRajinikanth Meets Yogi Adityanath
Rajinikanth Meets Yogi Adityanath
author img

By

Published : Aug 20, 2023, 6:22 AM IST

Updated : Aug 20, 2023, 6:48 AM IST

Rajinikanth Meets Yogi Adityanath : సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సక్సెస్​ను ఆస్వాదిస్తున్నారు. ఆయన ఉత్తర భారతంలో పలు పుణ్య క్షేత్రాలు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉత్తర్​ప్రదేశ్ వెళ్లారు. అక్కడ సాయంత్రం సమయంలో.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నివాసానికి చేరుకున్నారు. సీఎంను కలవగానే రజనీకాంత్.. ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు లఖ్​నవులోని రాజ్​భవన్​లో అక్కడి గవర్నర్ ఆనందీ బెన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు రజనీ. ఆదివారం రజనీ అయోధ్యకు వెళ్లనున్నారు.

కాగా గతవారం రజనీ ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్​ ఆలయాన్ని సందర్శించారు. సూపర్​స్టార్​కు అక్కడి పండితులు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆయన స్వర్ణ హారతిలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో రజనీ.. రిషికేష్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్ని సందర్శించి.. అక్కడున్న వారతో ముచ్చటించారు. కాగా తాజాగా ఉత్తరాఖండ్ అల్మోరాలోని ద్వారహత్​కు వెళ్లారు. ఆశ్రమంలోని సాధువులను కలిసి.. అక్కడి మహావతార్ బాబా గుహలో 30 నిమిషాలు ధ్యానం చేశారు. ఇక ఆయనను చూసేందుకు వచ్చిన అభిమానులతో సెల్ఫీ దిగారు. అనంతరం ఝార్ఖండ్ గవర్నర్​తో భేటీ అయ్యారు.

Last Updated : Aug 20, 2023, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.