ETV Bharat / entertainment

Rajinikanth Mahavatar Babaji : ఉత్తరాదిలో రజనీ సందడి.. ఆ గుహలో 30నిమిషాల పాటు ధ్యానం.. గవర్నర్​తో భేటీ! - రజనీకాంత్ న్యూస్

Rajinikanth Mahavatar Babaji : 'జైలర్​' రిలీజ్​కు ముందు నుంచే ఉత్తర భారత దేశంలో పర్యటిస్తున్న సూపర్​స్టార్​ రజనీకాంత్​ తాజాగా ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో కనిపించారు. ద్వారాహత్‌లోని మహావతార్ బాబా గుహలో ధ్యానం చేశారు. ఆ విశేషాలు మీ కోసం..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 18, 2023, 10:13 AM IST

Updated : Aug 18, 2023, 10:21 AM IST

Rajinikanth Mahavatar Babaji : సూపర్ స్టార్ రజనీకాంత్​ ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా హిమాలయాలు, బద్రీనాథ్​ క్షేత్రాన్ని సందర్శించిన ఆయన.. తాజాగా ఉత్తరాఖండ్ ​అల్మోరాలోని ద్వారహత్​కు చేరుకున్నారు. అక్కడున్న మహావతార్ బాబా గుహలో 30 నిమిషాలు ధ్యానం చేశారు. యోగదా ఆశ్రమంలోని సాధువులను కలుసుకున్నారు. మార్గమధ్యంలో ఆయన్ను చూసేందుకు తరలి వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగారు. మరుసటి రోజు ఉదయం ఆయన రాంచీకి బయలుదేరారు.

rajnikanth almora tour
అల్మోరాలో రజనీకాంత్​
rajnikanth almora tour
అల్మోరాలో రజనీకాంత్​
rajnikanth almora tour
అల్మోరాలో రజనీకాంత్​

ఝార్ఖండ్​ గవర్నర్​తో భేటీ..
Rajini Meets Jharkhand Governor : బాబా గుహలను సందర్శించిన ఆయన.. ఆ తర్వాత ఝార్ఖండ్​లోని రాంచీకి వెళ్లారు. అక్కడి గవర్నర్‌ సీపీ.రాధాకృష్ణన్​ను కలిసి కాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను గవర్నర్​ రాధాకృష్ణ ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

rajini meets jharkhand cm
ఝార్ఖండ్​ గవర్నర్​తో రజనీకాంత్​

"రాంచీకి రజనీ రావడం ఆనందంగా ఉంది. నా ప్రియ మిత్రుడైన ఆయనను రాజ్‌భవన్‌లో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఝార్ఖండ్‌ అనే గొప్ప ప్రదేశానికి ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను" అంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు.

  • On his arrival in Ranchi , delighted and very happy to meet my dear friend , one of India's greatest Actors and great Human Being Superstar Shri. @rajinikanth Ji at Raj Bhavan yesterday on a courtesy meet.
    I heartily welcome him to the great land of Jharkhand. pic.twitter.com/oyM049CWMv

    — CP Radhakrishnan (@CPRGuv) August 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Rajinikanth Jailer : 'జైలర్' రిలీజ్​కు ముందే హిమాలయాలకు బయలుదేరిన రజనీ ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఇక ఈ పర్యటన తర్వాత ఆయన చెన్నైకి తిరిగి వచ్చి 'జైలర్​' మూవీ టీమ్​తో సెలబ్రేషన్స్​ చేసుకోనున్నారట. ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన 'లాల్ సలామ్' సినిమాలో గెస్ట్​ రోల్​ చేశారు. ఈ ప్రాజెక్ట్​ తర్వాత 'జై భీమ్'​ దర్శకుడు జ్ఞానవేల్​తో కలిసి పనిచేయనున్నారు.

Rajinikanth Jailer Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'జైలర్​'ను తమిళ దర్శకుడు నెల్సన్​ దిలీప్​ కుమార్​ రూపొందించారు. యాక్షన్​, సెంటిమెంట్​,కామెడీ ఇలా అన్ని అంశాలను ఎంతో చక్కగా ఆయన చూపించారు. ఇందులో రజనీకి జోడిగా సీనియర్ హీరోయిన్​ రమ్యకృష్ణ మెరవగా.. మిల్క్​ బ్యూటీ తమన్న ఓ కీలక పాత్ర పోషించారు.

మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్​ హీరో శివ రాజ్‌కుమార్ గెస్ట్​ రోల్స్​లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక రజనీకాంత్​ కూడా తన మార్క్​ స్టైల్​తో ప్రేక్షకులకు వింటేజ్​ రజనీని గుర్తుచేశారు. యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్​​ అనిరుధ్​ రవిచందర్​ అందించిన సాంగ్స్​, బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ ఈ సినిమాకు మరో హైలైట్​గా నిలవగా..సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు తమ తమ పాత్రలతో ఆడియెన్స్​ను అలరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Rajnikanth Badrinath Visit : బద్రీనాథ్‌లో సూపర్​ స్టార్​ సందడి.. రజినీతో ఫొటో కోసం ఫ్యాన్స్ ఆసక్తి

Rajinikanth Himalayas : 4ఏళ్ల తర్వాత మళ్లీ హిమాలయాలకు రజనీ.. 'జైలర్​' రిలీజ్‌కు ముందే..

Last Updated : Aug 18, 2023, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.