Shekar movie court issue: సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన తాజా చిత్రం 'శేఖర్'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఓ ఆర్థిక వ్యవహారానికి సంబంధించిన విషయంలో చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. ఈ సినిమా ప్రదర్శన నిలిపివేశారు. అయితే తాజాగా శేఖర్ చిత్రబృందానికి కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి విషయాలు సరిగ్గా లేవని స్టే ఆర్డర్‌ను తోసిపుచ్చినట్లు రాజశేఖర్ ట్వీట్ చేశారు.
"ఈ కేసు సరైంది కాదని, ఆధారాలు సరిగ్గా లేవని.. స్టే ఆర్డర్‌ను కోర్టు తోసిపుచ్చింది. అయినా మేము వారంతపు కలెక్షన్లను కోల్పోయాం. ఆగిపోయినా మా శేఖర్ చిత్రాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను. ఈ సినిమాను భవిష్యత్‌లో ప్రదర్శించే విషయమై మా నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకున్నా వారి వెంటే ఉంటాం." అని రాజశేఖర్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రాన్ని బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గారం వెంకట శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మలయాళంలో విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ 'జోసెఫ్'కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకొంది.
ఇదీ చూడండి: అందులో నటించనన్న సాయిపల్లవి.. బొమ్మరిల్లు భాస్కర్‌తో చైతూ మూవీ!