ETV Bharat / entertainment

అతడితో నన్ను పోల్చొద్దు.. అది చాలా అవమానకరం: రాహుల్ రామకృష్ణ - comedian priyadarshi latest movie

Rahul Ramakrishna Tweet : కమెడియన్ రాహుల్ రామకృష్ణ, తన సహనటుడు ప్రియదర్శిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. తనను ప్రియదర్శితో పోల్చకూడదంటూ ట్విట్టర్​లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్​గా మారింది. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?

Rahul Ramakrishna Tweet
రాహుల్ రామకృష్ణ ట్వీట్
author img

By

Published : Jul 17, 2023, 6:13 PM IST

Rahul Ramakrishna Tweet : నటుడు ప్రియదర్శితో తనను పోల్చకూడదని.. కమెడియన్ రాహుల్ రామకృష్ణ అన్నారు. ఈ విషయానికి సంబంధించి.. 'నా ఆప్తమిత్రుడు ప్రియదర్శి.. నిబద్ధత, శ్రమించే మనస్తత్వం ఉన్నవాడు. ప్రియదర్శిని నాతో పోల్చడం అతడిని అవమానించినట్టే. అతడి గొప్పతనాన్ని తక్కువ చేసినట్టే అవుతుంది. ఈ పోలిక చాలా నాసిరకంగా ఉంది. నా స్నేహితుడికి నేను ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటా’ అని ట్విట్టర్​లో నటుడు రాహుల్ రామకృష్ణ పోస్ట్ చేశారు.

Rahul Ramakrishna On Priyadarshi : అయితే 'బలగం' సినిమాలో లీడ్ రోల్​లో నటించి హిట్​ అందుకున్నారు ప్రియదర్శి. మరోవైపు తాజాగా రాహుల్ రామకృష్ణ 'ఇంటింటి రామాయణం' మూవీతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేశారు. వేరువేరు సినిమాలతో వీరిద్దరూ హిట్ అందుకోవడం వల్ల సోషల్ మీడియాలో.. "ఇద్దరూ తగ్గట్లేదు.. యాక్టింగ్ కుమ్మేస్తున్నారుగా" అంటూ నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన రాహుల్ రామకృష్ణ ఈ మేరకు ట్వీట్ చేశారు.

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇద్దరూ దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మొదటగా కమెడియన్​గా కెరీర్​ ప్రారంభించిన వీరిద్దరు.. తాజాగా ప్రధాన పాత్రల్లో నటిస్తూ.. దూసుకుపోతున్నారు. వీరిద్దరూ 'అర్జున్ రెడ్డి', 'జాతిరత్నాలు', 'బ్రోచేవారెవరురా' వంటి సినిమాల్లో పోటీపడి మరీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. రీసెంట్​గా ప్రియదర్శి 'సేవ్​ ది టైగర్స్​' అనే వెబ్​ సిరీస్​లో కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో పక్కా తెలంగాణ స్లాంగ్​లో నటించి.. వెబ్​సిరీస్​కే హైలైట్​గా నిలిచారు.

ఇదిలా ఉండగా రాహుల్​ ట్వీట్​కు స్పందిస్తున్న నెటిజన్లు.. ఇద్దరూ ఇద్దరే. ఎవరేం తక్కువ కాదు. మాకు ఇద్దరూ గొప్పే. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మీరు చేస్తున్న సినిమాలు అద్భుతం. తెలుగు సినిమా ప్రేక్షకుల మనసులో ఇద్దరికీ ప్రత్యేక స్థానం ఉంటుందంటూ కామెంట్ సెక్షన్​లో పలువురు తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై ప్రియదర్శి ఎలా స్పందిస్తారో అనేది చూడాలి.

కాగా ప్రియదర్శి నటించిన బలగం సినిమాకు.. అవార్డులు వెల్లువెత్తుతున్నాయి. సినిమాకు ఇప్పటికే అనేక అవార్డులు వచ్చాయి. నేచురల్​గా, పల్లెటూరి బ్యాక్​డ్రాప్​లో కుటుంబ సభ్యుల అనుబంధాల గురించి సినిమాలో చూపిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు రాహుల్ రామకృష్ణ ఇంటింటి రామాయణం కూడా అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ అందుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.