ETV Bharat / entertainment

ఫారెన్​లో బన్నీ గ్రాండ్​ పార్టీ.. రొమాంటిక్​గా​ శౌర్య.. 'ఆర్​ఆర్​ఆర్'​ కలెక్షన్స్​ - అల్లుఅర్జున్​ బర్త్​డే ఫొటోస్​

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో అల్లుఅర్జున్​, నాగశౌర్య, రామ్​చరణ్​, ఎన్టీఆర్​కు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

Pushpa Alluarjun birthday grand party
పుష్ప గ్రాండ్​ పార్టీ
author img

By

Published : Apr 9, 2022, 12:25 PM IST

Nagashourya krishna vindra vihari song: యువహీరో నాగశౌర్య నటించిన రొమాంటిక్​ ఎంటర్​టైన్మెంట్​ చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. అనీష్‌ ఆర్‌.కృష్ణ దర్శకుడు. షిర్లే సెటియా కథా నాయిక. తాజాగా ఈ మూవీలోని 'వర్షంలో వెన్నెల' అనే రొమాంటిక్​ సాంగ్​ను స్టార్​ హీరోయిన్​ సమంత రిలీజ్​ చేసింది. చిత్రబృందానికి ఆల్​ ది బెస్ట్​ విషెస్​ తెలిపింది. యువతను ఆకట్టుకునేలా ఉన్న ఈ గీతాన్ని.. ఆదిత్య ఆర్కే, సంజన కల్మంజి ఆలపించారు. సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు.. ఉద్యోగం కోసమంటూ హైదరాబాద్‌ వెళ్తాడు. ఆ తర్వాత ప్రేమలో పడిన అతని ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగిందనేది ఈ చిత్ర కథాంశం. ఇందులో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా ఓ కొత్త రకమైన పాత్రలో కనిపించనున్నారు. సీనియర్‌ నటి రాధిక బలమైన పాత్రలో కనిపిస్తారు. వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయిశ్రీరామ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్‌ప్రసాద్‌ మూల్పూరి సమర్పకులు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Pushpa Alluarjun birthday grand party: 'పుష్ప' విజయంతో ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన క్రేజ్‌ కేవలం భారత్‌కు మాత్రమే కాకుండా విదేశాలకూ పాకింది. ఈ నేపథ్యంలో బన్నీ తన ఫ్రెండ్స్‌కి గ్రాండ్‌ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం 40వ వసంతంలోకి అడుగుపెట్టిన బన్నీ.. స్నేహితులకు విదేశాల్లో ప్రత్యేక పార్టీ ఇచ్చారు. సెర్బియా, బెల్‌గ్రేడ్‌ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో నిర్వహించిన ఈ పార్టీకి కేవలం 50 మందికి మాత్రమే ఆహ్వానం అందింది. స్నేహితుల సమక్షంలో తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి బన్నీ కేక్‌ కట్‌ చేశారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక, సినిమాల విషయానికి వస్తే ఈ టూర్‌ నుంచి వచ్చిన తర్వాత ఆయన తిరిగి సినిమా పనుల్లో బిజీ కానున్నారు. ‘పుష్ప’ విజయం తర్వాత ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘పుష్ప-2’ జూన్‌ లేదా జులైలో పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Pushpa Alluarjun birthday grand party
ఫ్రెండ్స్‌ కోసం విదేశాల్లో పార్టీ ఇచ్చిన బన్నీ
Pushpa Alluarjun birthday grand party
స్నేహతో కలిసి

భార్య స్నేహతో

RRR Hindi collections: విడుదలై రెండు వారాలు అవుతున్నా 'ఆర్​ఆర్​ఆర్' ఇంకా బాక్సాఫీస్​ ముందు గర్జిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇటీవలే గ్రాండ్​ సక్సెస్ పార్టీ కూడా చేసుకుంది. అయితే ఇప్పుడీ సినిమా హిందీ కలెక్షన్ల వివరాలను తెలిపారు సినీ విశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్​. తొలి వారం రూ.132.59, రెండో వారం రూ.76కోట్లు కలిపి మొత్తంగా రూ.208.59 కోట్లు సాధించినట్లు తెలిపారు. మూడో రోజు(రూ.50కోట్లు), ఐదో రోజు(రూ.100కోట్లు), తొమ్మిదో రోజు(రూ.150కోట్లు), పదమూడో రోజు(రూ.200కోట్లు) కలెక్ట్​ సరికొత్త బెంచ్​మార్క్​ను క్రియేట్ చేసింది.

RRR movie
ఆర్​ఆర్​ఆర్​

ఇదీ చూడండి: 'గాడ్​ఫాదర్​'లో పూరి.. కన్ఫామ్​​ చేసిన చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.