ETV Bharat / entertainment

Pushpa 2 Release Date: 'పుష్ప 2' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్​.. అఫీషియల్​ అనౌన్స్​మెంట్ వచ్చేసిందోచ్​ - అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల తేదీ

Pushpa 2 Movie Release Date : 'పుష్ప 2' రిలీజ్ డేట్​పై మూవీటీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఆ వివరాలు..

Pushpa 2 Release Date: 'పుష్ప 2' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్​.. అఫీషియల్​ అనౌన్స్​మెంట్ వచ్చేసిందోచ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 4:35 PM IST

Updated : Sep 11, 2023, 4:43 PM IST

Pushpa 2 Movie Release Date : ఇండియా వైడ్​ ఉన్న సినీ ప్రియులందరూ ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'పుష్ప ది రూల్‌' ఒకటి. అయితే ఈ చిత్ర రిలీజ్ డేట్​ను అఫీషియల్​గా అనౌన్స్ చేసింది మూవీటీమ్​. ఈ ప్రకటనపై బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్‌ - లెక్కల మాస్టర్​ సుకుమార్‌ కాంబినేషన్​లో వచ్చిన చిత్రం 'పుష్ప ది రైజ్‌'. 2021లో రిలీజైన ఈ చిత్రం ఊహంచని రేంజ్​లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అల్లు అర్జున్​కు పాన్ ఇండియా స్టేటస్​ను అందించింది. ముఖ్యంగా హిందీ ఆడియెన్స్​ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు పుష్ప ది రూల్‌ సిద్ధమవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్​గా శ్రీవల్లి పాత్రలో అలరించనుంది.

విలన్​గా పోలీస్​ ఆఫీసర్​ పాత్రలో ఫహద్ ఫాజిల్ కనిపించనున్నారు. తొలి భాగానికి వచ్చిన విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్​.. ఈ చిత్రాన్ని మరింత జాగ్రత్తగా, ఎంతో గ్రాండ్​గా తెరకెక్కించేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీక్వెల్​ చిత్రీకరణ దశలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్​పై భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. రాక్​స్టార్​ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే రీసెంట్​గా పుష్ప నటనకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ నేషనల్​ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే.

పుష్పలో ఏం చూపించారంటే: ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో పుష్ప తొలి భాగం సాగుతుంది. ఇందులో అల్లు అర్జున్​ ఎర్రచందనం స్మగ్లర్‌గా సాధారణ కూలి రేంజ్​ నుంచి పుష్పరాజ్​గా స్మగ్లింగ్​ సిండికేట్​ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడో చూపించారు. ఈ క్రమంలో పుష్ప రాజ్​కు మంగ‌ళం శ్రీను (సునీల్‌), కొండా రెడ్డి (అజ‌య్ ఘోష్‌) నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే ఆసక్తికర విషయాలను కూడా చూపించారు. చివరికి ఎస్పీ భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్ (ఫహాద్ ఫాజిల్‌)తో పుష్పరాజ్‌కు విరోధం ఏర్పడడం వంటి సన్నివేశాలతో సినిమాను ముగించారు. మరి రెండో భాగంలో పుష్పరాజ్‌ను అంతం చేయడానికి షెకావత్‌ ఏం చేశాడు? స్మగ్లింగ్‌ సిండికేట్‌కు కింగ్‌ అయిన పుష్ప రాజ్​ ఆ తర్వాత ఏం చేశాడు? అనే విషయాలతో పుష్ప 2ను తెరకెక్కిస్తున్నారు.

Alluarjun Latest Insta Post : ఫ్యాన్స్​కు బన్నీ బిగ్​ సర్​ప్రైజ్​.. 'పుష్ప 2' స్పెషల్ వీడియోతో

Pushpa 2 Release Date : నేషనల్ అవార్డు విన్నింగ్ జోష్​లో బన్నీ.. పుష్ప-2 రిలీజ్ ఎప్పుడంటే?

Last Updated : Sep 11, 2023, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.