ETV Bharat / entertainment

Pushpa 2 Latest Update : 'పుష్ప 2' నుంచి రష్మిక లీక్స్.. అప్​డేట్​ అదిరిపోయిందిగా.. - పుష్ప 2 ది రూల్​ తాజా అప్డేట్

Pushpa 2 Latest Update : పుష్ప 2 సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్​డేట్​​ వస్తుందా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో ఆ సినిమా హీరోయిన్​ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్​ చేసింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ ఫొటోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి..

Rashmika Pushpa 2
Rashmika Pushpa 2
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 1:32 PM IST

Updated : Sep 8, 2023, 4:34 PM IST

Pushpa 2 Latest Update : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. రష్మిక, ఫహాద్​, సునీల్​ లాంటి కీలక స్టార్స్​ నటించిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అయితే తొలి పార్ట్​ బ్లాక్​బస్టర్​ అవ్వడం వల్ల రానున్న సీక్వెల్​పై అభిమానుల్లో భారీ అంచనాలే పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా గురించి ఏ అప్​డేట్​ వచ్చినా అది నెట్టింట క్షణాల్లో ట్రెండ్​ అవుతోంది.

ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​​తో కలిసి 'డే విత్ అల్లు అర్జున్ ' అంటూ ఓ చిన్న ఇంటర్వ్యూ చేసిన అల్లు అర్జున్​.. ఆ వీడియోలో తన పర్సనల్​ లైఫ్​తో పాటు పుష్ప షూటింగ్​ను ఫ్యాన్స్​కు చూపించారు. సినిమా కోసం ఎంపిక చేసుకున్న లొకేషన్​ నుంచి.. ఆయన వేసుకునే దుస్తుల వరకు అన్నీ చూపించిన ఆయన.. ఓ చిన్న సీన్​లో యాక్ట్​ చేసిన గ్లింప్స్​ కూడా ఆ వీడియోలో ఉంది. ఇక ఈ పోస్ట్​ పెట్టిన కొద్ది నిమిషాలకే సోషల్ మీడియాలో హల్​చల్​ చేసింది. ఇలా పుష్పకు సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట చర్చనీయాంశంగా మారుతోంది.

Rashmika Pushpa 2 : ఈ క్రమంలో తాజాగా నటి రష్మిక తన ఇన్​స్టా స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ ఫొటోను షేర్​ చేశారు. అందులో ఓ భవనానికి సంబంధించిన ఫొటోను షేర్​ చేసిన ఆమె.. #Pushpa2 అనే క్యాప్షన్​ను జోడించారు. ఆ ఫొటో చూస్తుంటే సినిమాలో పుష్ప- శ్రీ వల్లి నివసించే ఇళ్లులా కనిపిస్తోందంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సిండికేట్ హెడ్​గా ఎదిగిన పుష్ప తనకంటూ ఓ ఇంద్ర భవనం లాంటి ఇళ్లు కట్టించుకున్నాడేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Rashmika Pushpa 2 Latest Insta Post
రష్మిక ఇన్​స్టా పోస్ట్- పుష్ప-2 ది రూల్

రిలీజ్​ డేట్​ ఫిక్స్​..?
Pushpa 2 The Rule Release Date : ఇటీవలే ఉత్తమ జాతీయ నటుడిగా నేషనల్​ అవార్డ్​ దక్కించుకున్నారు హీరో అల్లు అర్జున్​. ఇక ఇదే జోష్​తో ప్రస్తుతం 'పుష్ప ద రూల్​' సీక్వెల్​ షూటింగ్​లో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ అప్డేట్​ బయటకు వచ్చింది. అదే మూవీ రిలీజ్​ డేట్​. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్​ గిఫ్ట్​గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నట్లు మూవీ మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్​ నడుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2024 మార్చి 22, లేదా 29 తేదీల్లో ఏదో ఒక డేట్​ను దర్శక నిర్మాతలు​ ఫిక్స్​ చేయనున్నట్లు సమాచారం. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్యాన్​ ఇండియా మూవీ​ షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తియింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించనుంది మూవీ టీమ్​.

Last Updated : Sep 8, 2023, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.