ETV Bharat / entertainment

Project K : ప్రభాస్​ ఫస్ట్ లుక్​ వచ్చేసిందహో.. ఎలా ఉన్నాడో మీరే చెప్పండి! - మార్వెల్ హీరోలా ప్రభాస్​

Project K prabhas first look : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ప్రాజెక్ట్​ కె' ప్రభాస్​ ఫస్ట్​ లుక్​ను రిలీజ్ చేసింది మూవీటీమ్​.

Prabhas Project K movie first look released
Project K : ప్రభాస్ ఫస్ట్ లుక్​ వచ్చేసిందహో..
author img

By

Published : Jul 19, 2023, 3:44 PM IST

Updated : Jul 19, 2023, 4:48 PM IST

Project K prabhas first look : పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు వైజయంతి మూవీస్‌ అదిరిపోయే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్రభాస్​ హీరోగా తమ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ప్రాజెక్ట్‌ కె' నుంచి సరికొత్త అప్డేట్​ను రిలీజ్​ చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్​ ఫస్ట్​ లుక్​ను రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్​.. మార్వెల్ హీరోలా కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ లుక్ కాస్తా వెరైటీగానే ఉంది. ప్రభాస్ గడ్డంతో ఐరన్ మ్యాన్​ సూట్‌లో ఉన్నారు. అయితే ఈ లుక్‌పై మిక్స్​డ్​ రెస్పాన్స్ వస్తోంది. అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా అవుతోంది.

అమెరికాలో 'ప్రాజెక్ట్ కె' టీమ్​.. మరోవైపు అమెరికాలో 'ప్రాజెక్ట్‌ కె' మూవీటీమ్​ సందడి మొదలైంది. ప్రఖ్యాత శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌ వేదికపై టైటిల్ గ్లింప్స్​ను ఆవిష్కరించనున్నారు. దీంతో ఆ వేదికపై ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేయనున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా 'ప్రాజెక్ట్‌ కె' చరిత్ర సృష్టించనుంది. ఇప్పటికే హీరో ప్రభాస్‌, రానా, కమల్ హాసన్‌ అక్కడికి చేరుకున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ ఈరోజు వెళ్లనున్నారు. కొన్ని కారణాల వల్ల దీపికా వెళ్లట్లేదు. ఇక కామిక్ కాన్​ వేదికపైనే టైటిల్​తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసి, మూవీ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. హాట్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.

'ప్రాజెక్ట్ కె' అంటే ఏంటి?.. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి 'ప్రాజెక్ట్ కె' అర్థం తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. అయితే భారతీయ కాలమానం ప్రకారం ఈ నెల 21న దాని అర్థం ఏమిటో తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్​ను రిలీజ్ చేయనున్నారు. కానీ ఇప్పటికే టైటిల్ అర్థం ఇదేనంటూ ఓ పేరు సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'ప్రాజెక్ట్ కె' అంటే 'కాలచక్రం' అని జోరుగా ప్రచారం సాగుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్​తో రానున్న సినిమా కనుక.. ఈ టైటిల్ అయితే బావుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. ఇకపోతే ప్రభాస్​ పాత్ర 'కల్కి' తరహాలో, అమితాబ్ పాత్ర అశ్వద్ధామ తరహాలో ఉంటుందని చెబుతున్నారు.

ఇదీ చూడండి :

హాలీవుడ్ రేంజ్‌లో దీపిక 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్​ లుక్.. మీకు నచ్చిందా?

​ రెబల్స్​కు సర్​ఫ్రైజ్​.. ప్రాజెక్ట్​-కె టైటిల్​ రివీల్​.. దేశంలో తొలి సినిమాగా..

Last Updated : Jul 19, 2023, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.