ETV Bharat / entertainment

Prabhas Lokesh Kanagaraj Movie : LCUలో ప్రభాస్​ చిత్రం భాగమా కాదా.. లోకేశ్ ఆన్సర్​ ఇదే

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 11:29 AM IST

Updated : Oct 17, 2023, 11:43 AM IST

Prabhas Lokesh Kanagaraj Movie : ప్రభాస్​తో చేయబోయే సినిమా ఎల్​సీయూలో భాగామా కాదా అనే విషయమై తాజాగా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​. ఆ వివరాలు..

Prabhas Lokesh Kanagaraj Movie : LCUలో ప్రభాస్​ చిత్రం భాగమా కాదా.. లోకేశ్ ఆన్సర్​ ఇదే
Prabhas Lokesh Kanagaraj Movie : LCUలో ప్రభాస్​ చిత్రం భాగమా కాదా.. లోకేశ్ ఆన్సర్​ ఇదే

Prabhas Lokesh Kanagaraj Movie : 'లియో' ఫేమ్ డైరెక్టర్​ లోకేశ్​ కనగరాజ్​.. తన చిత్రాలను ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్​ అనే ప్రపంచాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 'ఖైదీ', 'విక్రమ్' చిత్రాలకు ఇప్పటికే లింక్​ పెట్టారు. నెక్ట్స్​ 'ఖైదీ 2', 'విక్రమ్ 2', అలాగే 'విక్రమ్'​ సినిమాలో రోలెక్స్​ పాత్రతో ఓ సినిమాను ఎల్​సీయూలో చూపించబోతున్నారు. ఇప్పుడు 'లియో'(Leo Movie Release Date) చిత్రంతో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇది కూడా ఎల్‍సీయూలో భాగమేనని కథనాలు వచ్చాయి కానీ.. ఇంకా దీనిపై లోకేశ్ సరైనా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్​లోనే ప్రభాస్​తో సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించారు.

తాజాగా ఇప్పుడు మరో ప్రమోషన్స్​లో పాల్గొన్న లోకేశ్​.. ఎల్​సీయూలో ప్రభాస్​ చిత్రం భాగామా కాదా అనే విషయమై కూడా స్పష్టత ఇచ్చేశారు. అది ఎల్‍సీయూలో భాగం కాదని చెప్పేశారు. స్టాండ్ అలోన్​గా ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. తన గత సినిమాలకు, ప్రభాస్‍తో చేసే చిత్రానికి అస్సలు సంబంధం ఉండదని అన్నారు.

ప్రభాస్​ కోసం ఒరిజినల్ స్టోరీని రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ వార్త తెలుసుకుంటున్న ఫ్యాన్స్​.. సంబరపడిపోతున్నారు. అయితే ఈ చిత్రం పట్టాలెక్కేందుకు మరో రెండేళ్ల సమయమైనా పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వీరిద్దరి చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. అవి పూర్తయ్యే సరికి ఇంకా సమయం పడుతుంది.

Rajinikanth Lokesh Kanagaraj Movie : లోకేశ్.. ​ 'లియో' తర్వాత తన తర్వాతి చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్​తో(తలైవార్​ 171 వర్కింగ్ టైటిల్​) చేస్తున్నారు. ఇది కూడా స్టాండ్ అలోన్​గానే ఉంటుందని స్పష్టత ఇచ్చారు లోకేశ్​. ఇకపోతే లోకేశ్.. ​ మెగా పవర్ స్టార్​ రామ్​చరణ్​తోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు, ప్రస్తుతం చర్చలు దశలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఎల్​సీయూలో భాగం అయ్యే అవకాశం ఉందని సిని వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Leo Movie Ticket Booking : టికెట్ల బుకింగ్​లో 'లియో' రికార్డుల మోత.. ఆ 10 నిమిషాలు డోంట్​ మిస్​!

Bhagavanth Kesari Overseas Booking : 'లియో'ను కాదని.. బాలయ్య మూవీ టికెట్లు కొంటున్న తమిళ ఫ్యాన్స్​!

Last Updated : Oct 17, 2023, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.