ETV Bharat / entertainment

మళ్లీ మొదలైన ప్రభాస్​ 'ప్రాజెక్ట్​ కె' షూటింగ్​ - సలార్​

Prabhas Project K: ఇటీవ‌లే 'రాధేశ్యామ్‌' సినిమాతో ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చిన ప్ర‌భాస్ త‌న త‌దుప‌రి చిత్రాలపై ఫుల్ ఫోక‌స్‌ పెట్టారు. ప్ర‌స్తుతం నాగ్​ అశ్విన్ ద‌ర్వ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్‌ షెడ్యూల్​లో జాయిన్​ అయ్యారు.

prabhas movie
prabhas movie
author img

By

Published : May 2, 2022, 7:29 PM IST

Prabhas Project K Shooting: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. డార్లింగ్​ నటిస్తున్న 'ఆదిపురుష్' ఆ మధ్య టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకోగా.. 'సలార్' చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ మరో ఆసక్తికరమైన చిత్రం 'ప్రాజెక్ట్ కె' ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. వైజయంతీ మూవీస్ బ్యానర్​పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తుండగా.. క్రేజీ బ్యూటీ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్​లో జరుగుతోంది. తాజాగా ప్రభాస్​ కూడా షూటింగ్​లో పాల్గొన్నారు.

ప్రభాస్, ఓ బాలీవుడ్ యాక్టర్‌పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రముఖ ఆర్ట్​ డైరెక్టర్​ తోట తరణి వేసిన మూడు ప్రధాన సెట్స్​లో టాకీ పార్ట్ షూట్ జరుగుతోంది. ఈ నెల 10 వరకు ఈ షెడ్యూల్​ను ప్లాన్ చేశారు మేకర్స్​. టైమ్ మెషిన్ కథాంశంతో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకు మిక్కీ.జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఏ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటారో చూడాలి.

ఇక, ఈ సినిమా కోసం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సాయం కోరారు. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సాంకేతిక సాయం కావాలని అడిగారు. అందుకు స్పందించిన మహీంద్రా.. ఇంత సదావకాశాన్ని తామెందుకు వదులుకుంటామని బదులిచ్చారు. అవసరమైన సాయం అందిస్తామని కూడా తెలిపారు.

ఇదీ చదవండి: 'సర్కారు వారి 'ట్రైలర్'' వచ్చేసింది.. మహేశ్​కు మరో మాస్ హిట్!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.