ETV Bharat / entertainment

ఒక్కో నెలలో ఒక్కోటి.. పవన్ లైనప్​ జోరు మీదుందే

author img

By

Published : Feb 8, 2023, 7:29 PM IST

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ నటిస్తున్న మరో కొత్త సినిమా సెట్స్​పైకి వెళ్లేందుకు సిద్ధమైందని సమాచారం. ఫిబ్రవరి 14న గ్రాండ్​గా షూటింగ్ ప్రారంభించుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

pawankalyan vinodaya-seetham
ఒక్కో నెలలో ఒక్కోటి.. పవన్ లైనప్​ జోరు మీదుందే

ఓవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. ప్రస్తుతం టాలీవుడ్​లో ప్రభాస్​ తర్వాత ఈ హీరో లైన్​లో పెట్టలేనన్ని సినిమాలను వరుసగా లైనప్​లో పెట్టారు. అయితే వీటిని ప్రకటించారేగాని సెట్స్​పైకి తీసుకెళ్లలేదు. దీంతో అభిమానులు షూటింగ్​ ఎప్పుడు మొదలుపెడతారు, థియేటర్లలోకి ఎప్పుడూ తీసుకొస్తారు అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన.. తన అభిమానుల్లో జోష్​ నింపేలా... కొత్త సినిమాలను వరుసగా ఒక్కొక్కటిగా సెక్స్ పైకి తీసుకెళ్లడం ప్రారంభించారు.

అలా గతేడాది డిసెంబర్లో హరిశంకర్​ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఉస్తాద్​ భగత్ సింగ్​ను ప్రారంభించగా.. ఇక ఈ ఏడాది జనవరిలో దర్శకుడు సుజిత్​తో చేయనున్న భారీ యాక్షన్ ప్రాజెక్టు OGని మొదలు పెట్టేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన చేయబోతున్న త‌మిళ చిత్రం వినోదయ సీత‌మ్ తెలుగు రీమేక్​ను సెక్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదిగో షూటింగ్​ ప్రారంభం.. ఇదిగో షూటింగ్​ మొదలు అంటూ.. ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రం కూడా ఎట్టకేలకు చిత్రీకరణ ప్రారంభించుకోనుందట. వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న పూజా కార్యక్రమాలతో ఈ మూవీని కూడా గ్రాండ్​గా ప్రారంభిస్తారని తెలిసింది. అలా ఒక్కో నెలలో ఒక్కో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు పవన్​.

ఇక వినోధ‌య సీత‌మ్ తెలుగు రీమేక్‌ విషయానికొస్తే.. స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. మాతృకలో కూడా ఈయనే స్వీయదర్శకత్వం రూపొందించి నటించారు. మెగా మేన‌ల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా ఇందులో కనిపించనున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సంభాష‌ణలు అందిస్తున్నారు. కేతిక శ‌ర్మ హీరోయిన్​గా కనిపించనుందని తెలుస్తోంది. మరి మ‌రో హీరోయిన్ ఎవ‌ర‌నేది స్పష్టత లేదు. ఇకపోతే ప‌వ‌న్ కల్యాణ్‌కు రీమేక్‌లు కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్ నటించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వ‌కీల్ సాబ్‌గా రీమేక్‌ చేసి బ్లాక్ బాస్ట‌ర్ హిట్టు కొట్టారు. మ‌ల‌యాళ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కొషియమ్ కూడా రీమేక్‌ చేసి మంచి సక్సెస్​ను అందుకున్నారు. మరి ఈ సారి చేయబోతున్న ఈ రీమేక్.. బాక్సాపీస్ వ‌ద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటో చూడాలి.

ఇదీ చూడండి: ఆ కన్నడ డైరెక్టర్​కు చరణ్​ గ్రీన్​ సిగ్నల్​.. ఆ రోజే అనౌన్స్​మెంట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.