ETV Bharat / entertainment

'బ్రో' గుడ్ న్యూస్​.. టికెట్ రేట్స్​ గురించి ఇది విన్నారా? - Bro movie extra shows

పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్, సాయి తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్​ 'బ్రో' సినిమా టికెట్​ రేట్స్​ గురించి గుడ్​ న్యూస్ చెప్పారు చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఆ వివరాలు..

Bro movie tickets
'బ్రో' గుడ్ న్యూస్​.. టికెట్ రేట్స్​ గురించి ఇది విన్నారా?
author img

By

Published : Jul 19, 2023, 3:28 PM IST

Updated : Jul 19, 2023, 5:18 PM IST

Bro movie tickets price : పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్, సాయి తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్​ 'బ్రో' సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది. దీంతో అభిమానుల్లో ఫుల్ జోష్​ నెలకొంది. మెగా మామా అల్లుడు కలిసి మొదటి సారి నటించడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. సినిమా జులై 28న గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో చిత్రబృందం క్రమక్రమంగా ప్రమోషన్స్​లో కాస్త జోరు పెంచుతోంది.

ఇందులో భాగంగానే 'బ్రో' మూవీ ప్రొడ్యూసర్​ టీజీ విశ్వప్రసాద్ ఓ శుభవార్త తెలిపారు. టికెట్ల రేట్స్​ పెంచడం లేదని పేర్కొన్నారు. సినిమాను పరిమిత బడ్జెట్​లోనే రూపొందించినట్లు తెలిపిన ఆయన.. అందుకే ఈ చిత్ర టికెట్ ధరలను పెంచట్లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు ఎలాంటి అదనపు షోలు కూడా వేయట్లేదని చెప్పుకొచ్చారు.

Bro movie trailer : ఇకపోతే 'బ్రో' సినిమా ట్రైలర్..​ జులై 21న విడుదల చేయనున్నారు మేకర్స్​. 25న గ్రాండ్​గా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను నిర్వహించబోతున్నారని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సాయితేజ్ సరసన కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్​గా నటించారు. తమన్ స్వరాలు సమకూర్చారు. తమిళంలో ప్రేక్షకుల మదిని దోచిన 'వినోదయ సీతం' సినిమాకు రీమేక్​గా ఈ చిత్రం తెరకెక్కింది. మాతృకలో దర్శకత్వం వహించిన సముద్రఖనినే.. రీమేక్​కు కూడా దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఒరిజినల్​ స్టోరీలో మార్పులు చేసి తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

ఇక ఈ సినిమా కథేంటంటే.. అనుకోకుండా ఓ రోడ్డు ప్రమాదంలో తుదిశ్వా విడిచిన ఓ వ్య‌క్తికి దేవుడు కనిపించి.. రెండో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే క‌థాంశంతో సినిమాను తీర్చిదిద్దారు. ఇందులో పవన్​.. టైమ్ అనే మోడ్రన్ గాడ్ రోల్​లో కనిపించారు. సాయితేజ్.. మార్కాండేయులు అలియాస్ మార్క్ అనే పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, రెండు పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ భారీ స్థాయిలో ట్రెండ్ అవ్వలేదు. చూడాలి మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో..

ఇదీ చూడండి :

పవన్​తో గడిపిన ఆ ఐదు నిమిషాలు.. అబ్బో ఆ అనుభూతి వేరే లెవెల్!​ : కేతిక శర్మ

'బ్రో'.. పవన్​ సినిమాకు ఊహించని షాక్​!

Last Updated : Jul 19, 2023, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.