ETV Bharat / entertainment

ఆచార్య ప్రీరిలీజ్​ ఈవెంట్​కు పవన్​.. తెలుగులో 'ది కశ్మీర్​ ఫైల్స్'​ - ది కశ్మీర్​ ఫైల్స్​

మెగా హీరోలు చిరంజీవి, రామ్​చరణ్​లు నటించిన 'ఆచార్య' సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​.. ఈ నెల 23న ఘనంగా జరగనుంది. ఇక ఆ ఈవెంట్​కు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ అతిథిగా హాజరవ్వబోతున్నారని తెలిసింది. మరోవైపు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ది కశ్మీర్​ ఫైల్స్'​ చిత్రం మే మెుదటి వారంలో హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా ఓటీటీలోకి విడుదల రానుందని సమాచారం.

pavan-kalyan-attends-acharya-prerelease-event-and-the-kashmir-files-in-telugu-ott

author img

By

Published : Apr 19, 2022, 9:42 PM IST

Acharya Pre Release Event Pavan: చిరంజీవి, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక.. ఈ నెల 23న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌కల్యాణ్‌ హాజరుకానున్నారని సమాచారం. అన్నదమ్ములిద్దరూ ఒకే వేదికపై కనిపించబోతుండడం అభిమానులకు కనుల పండుగే అని చెప్పొచ్చు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌, రామ్‌చరణ్​ సరసన పూజా హెగ్డే నటించారు. రెజీనా ఓ ప్రత్యేకంగా గీతంలో సందడి చేయనుంది. కొణిదెల ప్రొడక్షన్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్​ 29న విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

The Kashmir Files OTT Streaming: 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'.. ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి స్టార్‌ కాస్ట్‌ లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది. 1990లో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన హత్యాకాండ నేపథ్యంలో బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఈ మూవీని తెరకెక్కించారు. ఈ క్రమంలో 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ రైట్స్‌ను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. థియేటర్లో కేవలం హిందీలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందట. త్వరలోనే ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందని తెలిసింది. మే మొదటి వారంలో జీ5లో విడుదల కానుందని సమచారం.

Actor Saikumar New Movie: డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'వన్ బై టూ'. ఆనంద్, శ్రీ పల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. చెర్రీ క్రియేటివ్ వర్క్స్, వీఐపీ క్రియేషన్స్ బ్యానర్లపై కరణం శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి శివ ఏటూరి దర్శకత్వం వహించారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్​తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

saikumar new movie
సాయి కుమార్​ 'వన్​ బై టు'

Nani 'Ante Sundarniki' Trailer Launch Event: నేచురల్ స్టార్ నాని.. 'అంటే సుందరానికి' చిత్రంతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 10, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్​ను బుధవారం ఉదయం 11:07 గంటలకు హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్​ వెల్లడించారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్​కు పలువురు సెలబ్రిటీలు హాజరవుతారని తెలుస్తోంది.

nani movie
నాని 'అంటే సుందరానికి'

ఇవీ చదవండి: 'ఆ దర్శకుడ్ని తొలిసారి చూసి వణికిపోయా.. హంతకుడు అనుకుని..'

జవాన్లకు రామ్​చరణ్ స్పెషల్ ట్రీట్.. షారుక్​ కొత్త చిత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.