ETV Bharat / entertainment

Parineeti Chopra Raghav Chadha Wedding : 18 పడవల్లో వరుడి ఊరేగింపు.. ఘనంగా పరిణీతి- రాఘవ్ పరిణయం - రాఘవ్ చద్దా పరిణీతి చోప్రా పెళ్లి

Parineeti Chopra Raghav Chadha Wedding : బీటౌన్​ బ్యూటీ​ పరిణీతి చోప్రా, ఆమ్​ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్​ పెళ్లి బంధంతో ఆదివారం ఒక్కటయ్యారు. బంధుమిత్రులు, క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో రాజస్థాన్..​ ఉదయర్​పుర్​లోని లీలా ప్యాలస్​ వేదికగా వీరి విహాహం ఘనంగా జరిగింది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 8:01 PM IST

Updated : Sep 24, 2023, 8:34 PM IST

Parineeti Chopra Raghav Chadha Wedding : ప్రముఖ బాలీవుడ్​ నటి​​ పరిణీతి చోప్రా, ఆమ్​ ఆద్మీ ఎంపీ రాఘవ్​ చద్దా ఆదివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకలు ఆదివారం ఉదయం ఉదయ్​పుర్​లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వరుడిగా ముస్తాబైన రాఘవ్​ చద్దా మధ్యాహ్నం 2 గంటల సమయంలో వధువు వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. ఉదయ్​పుర్​లోని లీలా ప్యాలస్​ నుంచి తాజ్​ లేక్​ ప్యాలస్​ వరకు బంధుమిత్రులతో 18 పడవలలో వెళ్లారు. అనంతంరం లీలా ప్యాలెస్​కు చేరుకున్న రాఘవ్​, అతిథులకు.. పరిణీతి చోప్రా కుటుంబం శీతల పానియాలు, డ్రైఫ్రూట్స్​, స్వీట్స్​ ఇచ్చి ఘనంగా స్వాగతం పలికింది. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటల సమయంలో లీలా ప్యాలెస్​లోని పెళ్లి మండపంలో వేద మంత్రాల సాక్షిగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పరిణీతి-రాఘవ్​ ఒక్కటయ్యారు.

ఈ స్టార్​ కపుల్ వివాహ వేడుకలకు ఆప్​ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిథ్య ఠాక్రే, మాజీ క్రికెటర్​ హర్భజన్ సింగ్, స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ సానియా మీర్జా వంటి తదితర క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వివాహానికి వచ్చిన అతిథులకు వివిధ రాష్ట్రాల వంటలు రుచిచూపించారు. ప్రత్యేకంగా రాజస్థాన్​, పంజాబ్​​ వంటలతో సహా ఇటాలియన్, ఫ్రెంచ్​ డిషెస్​ కూడా వడ్డించారు. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత గ్రాండ్​ రిసెప్షన్​ ఏర్పాటు చేశారు.
వివాహ వేడుకల కోసం శుక్రవారమే ఈ జంట ఉదయ్​పుర్​కు వచ్చింది. వీరి తర్వాత ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. శనివారం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. హల్దీ, సంగీత్​ వేడుకలు ఘనంగా జరిగాయి.

డిజైనర్​ డెస్సుల్లో మెరిసిన వధూవరులు..
Parineeti Raghav Wedding Dress : ఈ జంట పెళ్లి దుస్తులను ఇద్దరు డిజైనర్లు రెడీ చేశారు. రాఘవ్ చద్దా మామ, ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్‌దేవా, వరుడి కోసం అన్ని వివాహ దుస్తులను డిజైన్ చేశారు. ఇక పెళ్లి కూతురు పరణీతి ప్రముఖ డిజైనర్​ మనీశ్​ మల్హోత్రా రూపొందించిన దస్తులను ధరించింది.

గ్రాండ్​గా జరుగుతున్న పరిణీతి పెళ్లి వేడుకలు.. వరుడి కోసం మామ స్పెషల్​గా ఏం చేశారంటే ?

Parineeti Chopra Raghav Chadha Marriage : గెస్ట్​లుగా 4రాష్ట్రాల సీఎంలు.. రెండు రిసెప్షన్లు.. పరిణీతి- రాఘవ్​ పెళ్లి వేడుకల్లో అదే హైలైట్​!

Last Updated : Sep 24, 2023, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.