ETV Bharat / entertainment

Nikhil Spy Movie : 'ఆ కారణంతోనే 'స్పై' మూవీ ఫ్లాప్​'.. హీరో నిఖిల్​ షాకింగ్​ కామెంట్స్ - స్పై మూవీ ఫెయిల్యూర్​పై హీరో నిఖిల్ సిద్ధార్థ్​

Nikhil Spy Movie : 'స్పై' మూవీ ఫ్లాప్​పై మొదటిసారి స్పందించారు హీరో నిఖిల్​ సిద్ధార్థ్​. హైదరాబాద్​లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినిమా రిలీజ్​పై ఆసక్తికర కామెంట్స్​ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..

Hero Nikhil Comments On Spy Movie Failure
Hero Nikhil Comments On Spy Movie Flop
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 10:36 PM IST

Nikhil Spy Movie : యంగ్​ హీరో నిఖిల్​ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'కార్తికేయ-3', 'స్వయంభూ', 'ది ఇండియా హౌస్‌' ఇలా పాన్ ఇండియా లెవెల్​ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో బిజీ షెడ్యూల్​లో ఉన్న ఈ స్టార్​ హీరో తాజాగా హైదరాబాద్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానిమిచ్చారు. అయితే ఆయన ఈ ఈవెంట్​లో ఓ షాకింగ్​ విషయాన్ని రివీల్​ చేశారు. తాను నటించిన ఓ సినిమాను షూటింగ్‌ పూర్తవ్వకుండానే రిలీజ్‌ చేశారని.. అందుకే ఆ చిత్రం ఫ్లాప్ అయిందని హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సినిమా మరేదో కాదు ఇటీవలే విడుదలైన 'స్పై' సినిమా. అయితే గతంలో తన సినిమాల్లో జరిగిన తప్పులు రానున్న వాటిల్లో జరగకుండా చూసుకుంటాని చెప్పుకొచ్చారు.

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ అదృశ్యం వెనుక ర‌హ‌స్యాన్ని స్పృశిస్తూ.. ఓ గూఢ‌చారి క‌థ‌తో 'స్పై' చిత్రం రూపొందింది. అయితే, ఎన్నో అంచనాల నడుమ ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ క్రమంలో తాజాగా దీని గురించి నిఖిల్ అసహనం వ్యక్తం చేశారు.

"స్పై సినిమా విషయంలో చాలా తప్పులు జరిగాయి. పది రోజుల షూటింగ్​ మిగిలి ఉండగానే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేసి విడుదల చేశారు. అందుకే అది ప్రేక్షకాదరణ పొందలేదని నా అభిప్రాయం. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులను నిరాశపరచినందుకు నేను క్షమాపణలు కూడా చెప్పాను. రానున్న సినిమాల్లో అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. 'కార్తికేయ-3', 'స్వయంభూ', 'ది ఇండియా హౌస్‌' సినిమాల క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడను. నా అభిమానులకు మంచి సినిమాలను అందిస్తాను" అని తన అభిమానులకు నిఖిల్ మాటిచ్చారు.

Nikhil Movies List : ఇక ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభూ' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం నిఖిల్‌ 3 నెలల పాటు వియత్నాంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు.

2023 Top 5 Movies : టాప్​ 5 లిస్ట్​లో 'లియో', 'జైలర్​'​.. మరి 'సలార్​' నిలుస్తుందా?

Suriya 43 Movie Cast : ఇంట్రెస్టింగ్​గా 'సూర్య 43' గ్లింప్స్​.. టైటిల్​ విషయంలో ఆ సస్పెన్స్​ ఏంటో ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.