Niharika divorce : మెగాడాటర్ నిహారిక.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. నటుడు నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. నటిగా నిర్మాతగా రాణిస్తూ కెరీర్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో రీసెంట్గాతన భర్తతో విడాకులు తీసుకుంది మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు కాస్త హ్యాపీగా.. కొన్ని నెలల పాటు డ్రామా సృష్టించిన నిహారిక-చైతన్య జొన్నలగడ్డ జంట.. ఫైనల్‌గా డొవర్స్ తీసుకునట్లు అధికారికంగా తెలిపారు. నిహారిక తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెడుతూ తన డివొర్స్ విషయాన్ని చెప్పింది. అయితే ఇప్పుడు ఈ డివొర్స్ వ్యవహారం ముగిశాక.. నిహారిక కాస్త ఆనందంలో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఇన్‌స్టాలో ఓ కొత్త వీడియోను పోస్ట్‌ను చేసింది. ఓ నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడుపుతున్న ఫొటోను అందులో చూపించింది.
అమ్మాయిలు ఇలా ఉంటారు.. ప్రతి అమ్మాయిల గ్యాంగ్‌లో ఇలా నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారని చెప్పుకొచ్చింది నిహారిక. తనని తాను ఉద్దేశిస్తూ.. ఒకరు ఎప్పుడు మంచిగా డ్రెస్సింగ్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు అని చెప్పింది. ఇంకొకరు ఎప్పుడూ ఏదీ వేసుకున్నా కాన్ఫిడెంట్‌గా ఉంటారని చెప్పింది. మరొకరు.. ఎప్పుడు కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపరు, చివరిగా ఓ మహాతల్లి ఉంటుంది.. తనెప్పుడు అస్సలు కనపడదు.. అంటూ చెప్పుకొచ్చింది.
డివొర్స్ గురించి ఇలా.. అంతకుముందు నిహారిక డివొర్స్ గురించి ఇలా ట్వీట్ చేసింది. "నేను, చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని డిసైడ్ అయ్యాం. ఇలాంటి సమయంలో నాతో ఉండి సపోర్ట్ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కు ధన్యవాదాలు. ఇక మా వ్యక్తిగత జీవితాల్లో ముందుకు వెళ్లేందుకు మాకు కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు" అని తెలిపింది. ఇక చైతన్య కూడా ఇన్‌స్టాలో ఇదే విషయాన్ని చెప్పాడు.
ఇకపోతే 2020 డిసెంబర్‌లో నిహారిక- చైతన్య జొన్నలగడ్డ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్లే ఈ విడాకులు తీసుకున్నారట. రీసెంట్గా డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌తో నిహారిక ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదీ చూడండి :
నిహారిక- చైతన్య విడాకుల కారణాలపై సోషల్‌మీడియాలో రచ్చ.. ముందుగా పిటిషన్ వేసిందెవరంటే?
Niharika Chaitanya Divorce : విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య దంపతులు