ETV Bharat / entertainment

NBK 108 : ఆర్టీసీ డ్రైవర్​గా బాలయ్య!.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్​ - NBK 108 అనిల్ రావిపూడి

NBK 108 : కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్​ అనిల్​ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ఎన్​బీకే 108'. ఈ చిత్రం స్టోరీ లైన్​, బాలయ్య క్యారెక్టర్​ గురించి ఓ అప్డేట్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

NBK 108 Movie Hero Balakrishna As A Bus Driver Rumour
ఖైదీ పాత్రలో బాలయ్య..? కాదు బస్సు డ్రైవర్​ అంటూ పుకార్లు!
author img

By

Published : May 15, 2023, 6:50 PM IST

Updated : May 15, 2023, 9:27 PM IST

NBK 108 : నటసింహం నందమూరి బాలకృష్ణ, క్రేజీ డైరెక్టర్​ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఎన్​బీకే 108'. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్​ వచ్చింది. ఈ మేరకు ఓ వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలయ్య ఆర్టీసీ డ్రైవర్​గా నటించనున్నారని అంతకుముందు జోరుగా ప్రచారం సాగింది. దీనిపై స్పందించిన చిత్ర యూనిట్​ ఆ ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ సినిమాలో బాలకృష్ణ ఓ పవర్​ఫుల్ ఖైదీ​ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.

తెలంగాణ యాసలో!
తెలంగాణ నేపథ్యంలో రానున్న ఈ చిత్రం.. భారీ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందుతోంది. అంతేగాక సినిమాలో బాలయ్య డైలాగ్స్​ పూర్తిగా తెలంగాణ యాసలోనే ఉండనున్నాయట. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్​ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.

స్టోరీ లైన్ ఇదే!
హీరో ముప్పై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆవేశంలో స్థానికులతో తీవ్రమైన గొడవలకు దిగుతాడు. దీంతో అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అలా అతడి జీవితంలో జరిగే పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్​ టు బ్యాక్​ సక్సెస్​లను అందుకుని ఫుల్​ జోష్​ మీదున్న బాలకృష్ణ.. సక్సెల్​ఫుల్​ డైరెక్టర్​ అనిల్ రావిపూడితో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్​పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో హ్యాట్రిక్​ హిట్​ కొట్టాలని బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. అలాగే సీనియర్ యాక్టర్​ శరత్ కుమార్ బాలయ్య సోదరుడిగా కనిపించనున్నారు.​ ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విలన్​గా బాలీవుడ్​ స్టార్​..
ఈ సినిమాలో విలన్​ రోల్​లో బాలీవుడ్​​ యాక్టర్​ అర్జున్ రాంపాల్​ నటిస్తున్నట్లు సినిమా యూనిట్​ ఇంతకుముందే ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక వీడియోను కూడా సోషల్​ మీడియాలో పోస్ట్ చేసింది. 'జాతీయ పురస్కార గ్రహీత, టాలెంటెడ్​ ఆర్టిస్ట్ అర్జున్ రాంపాల్​కు వెల్కమ్! తెలుగులో విలన్​గా అరంగేట్రం చేయనున్నారు' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్​ పేర్కొంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.36 కోట్లకు కొనుగోలు చేసిందట.

Last Updated : May 15, 2023, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.