ETV Bharat / entertainment

ఆది పెళ్లిలో నాని​ హంగామా.. సాంగ్​తో 'మేజర్​', 'గాడ్సే' రిలీజ్​ డేట్​ - satya dev godse updates

Adi pinisetty marriage nani dance: నటుడు ఆది పినిశెట్టి పెళ్లి వేడుక అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వధూవరులిద్దరితో హీరో నాని, సందీప్​ కిషన్​ చిందుల వేశారు.

Adi pinnishetty marriage
ఆదిపినిశెట్టి పెళ్లిలో నాని చిందులు
author img

By

Published : May 18, 2022, 5:19 PM IST

Adi pinisetty marriage nani dance: నటుడు ఆది పినిశెట్టి వివాహం వేడుకగా జరుగుతోంది. తన ప్రియురాలు, నటి నిక్కీ గల్రానీ మెడలో ఆయన ఈరోజు(బుధవారం) సాయంత్రం మూడుముళ్లు వేయనున్నారు. చెన్నైలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతోన్న ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి సంగీత్‌, బుధవారం ఉదయం హల్దీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదికి ఆప్తమిత్రులైన నాని, సందీప్‌ కిషన్‌ పాల్గొన్నారు. హల్దీ అనంతరం వధూవరులిద్దరితో కలిసి నాని, సందీప్‌ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆది-నిక్కీలకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

2015లో విడుదలైన 'యాగవరైనమ్‌ నా కక్కా' (Yagavarayinum Naa Kaakka) కోసం మొదటిసారి ఆది-నిక్కీ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ కుదిరింది. ఆ తర్వాత 'మరగాధ నాణ్యం' చిత్రీకరణ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఇక, 'ఒక విచిత్రం', 'గుండెల్లో గోదారి', 'సరైనోడు', 'నిన్నుకోరి', 'రంగస్థలం చిత్రాలతో ఆది తెలుగువారికి సుపరిచితులయ్యారు.

Adi pinnishetty marriage
హల్దీ వేడుకలో ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ
Adi pinnishetty marriage
ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లిలో హీరో ఆర్య
Adi pinnishetty marriage
ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి

Major song update: 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ టైటిల్‌ పాత్ర పోషించగా సయీ మంజ్రేకర్‌, శోభిత, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ‘ఓహ్‌ ఇషా’ అనే గీతాన్ని విడుదల చేసింది. మేజర్‌ సందీప్‌ ప్రేమ కథను ఆవిష్కరిస్తూ సాగే గీతమిది. శేష్‌, సయీ రొమాంటిక్‌ లుక్‌లో కనిపించి, అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. రాజీవ్‌ భరద్వాజ్‌ రచించిన ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌, చిన్నయి శ్రీపాద ఆలపించారు. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందించారు. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్స్‌, ఏ ప్లస్‌ ఎస్‌, సోనీ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Actor Satyadev God-se release date: నటుడు సత్యదేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర 'గాడ్సే'. గోపీ గణేష్‌ పట్టాభి దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్‌ నిర్మాత. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటించింది మూవీటీమ్​. జూన్​ 17న థియేటర్లలో రిలీజ్​ కానున్నట్లు తెలిపింది. కాగా, ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, పృథ్వీ, నాగబాబు, సిజ్జు మేనన్‌, నోయల్‌, ప్రియదర్శి, చైతన్యకృష్ణ తదితరులు నటించారు. సురేష్‌.ఎస్‌ ఛాయాగ్రహణం అందించగా.. సునీల్‌ కశ్యప్‌ సంగీతాన్ని సమకూర్చారు.

Satya dev godse release date
గాడ్సే రిలీజ్ డేట్​

ఇదీ చూడండి: ఖరీదైన కారు కొన్న విశ్వక్‌ సేన్​.. అది నాదే అంటూ దర్శకుడి పోస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.