ETV Bharat / entertainment

రవితేజ నిర్మాతగా 'మట్టి కుస్తీ'.. ఫస్ట్‌ లుక్ రిలీజ్​ చేసిన మాస్ మహారాజా

తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన 'మట్టి కుస్తీ' ఫస్ట్ లుక్‌ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. ఈ సినిమాను విష్ణు విశాల్‌తో కలిసి ఆయన సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

author img

By

Published : Nov 2, 2022, 10:55 PM IST

mass-maharaja-ravi-teja-unveiled-first-look-of-vishnu-vishal-matti-kusthi

Matti Kusthi First Look: మాస్ మహారాజా రవితేజ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆర్‌టీ టీమ్‌ వర్క్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన.. మొదటిగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా రవితేజ వ్యవహరించారు. 'రావణాసుర' నిర్మాణంలోనూ ఆర్‌టీ టీమ్‌వర్క్స్ భాగస్వామిగా ఉంది. తాను హీరోగా నటిస్తోన్న సినిమాల్లో నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడమే కాకుండా బయట హీరోలతోనూ తన నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తున్నారు. వాటిలో విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' ఒకటి.

రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ'. ఆర్‌‌టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌‌లపై రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మీ నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను బుధవారం రవితేజ విడుదల చేశారు. 'మట్టి కుస్తీ' కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. విష్ణు విశాల్ రెజ్లర్‌గా కనిపించనున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో రెజ్లర్‌గా విష్ణు విశాల్ లుక్ అదిరిపోయింది. డిసెంబర్‌‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Matti Kusthi First Look
ఫస్ట్​ లుక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.