ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు మనోజ్ రిటర్న్​ గిఫ్ట్ - 'ఉస్తాద్' ప్రోమో రిలీజ్ - manchu manoj latest news

Manchu Manoj Ustaad Talk Show Promo : టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ హోస్ట్​గా 'ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం' అనే షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. మరి మీరు ప్రోమో చూశారా?

manchu manoj ustaad talk show promo
manchu manoj ustaad talk show promo
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 4:20 PM IST

Updated : Dec 6, 2023, 5:10 PM IST

Manchu Manoj Ustaad Talk Show Promo : టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ త్వరలో బుల్లితెరపై ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన హోస్ట్​గా 'ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం' అనే గేమ్ షో ప్రారంభం కానుంది. ఈ షో ప్రోమో రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్​కు హీరో మనోజ్ తన సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. కాగా, ఆయన భార్య మౌనిక, ఈ ప్రోగ్రామ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్​లో ప్రసారం కానుంది.

ఇక మనోజ్ కెరీర్​లో తొలిసారిగా హోస్ట్​గా వ్యవహరించనున్నారు. ఈ ఈవెంట్​కు హోస్ట్ మనోజ్ ఫ్యామిలీ సహా, నిర్మాత వివేక్ కుచిబొట్ల, రైటర్ బీవీఎస్ రవి, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ, పలువురు సెలబ్రిటీలు, తదితరులు పాల్గొన్నారు. ఈ గేమ్​ షో పలు సీజన్​ల వారిగా ప్రసారం కానున్నట్లు ప్రోగ్రామ్ టీమ్ పేర్కొంది. కాగా, గేమ్​ షోకు ఎవరెవరు సెలబ్రిటీలు వచ్చారన్న విషయం బయటకు వెల్లడించలేదు.

అయితే 2017 మనోజ్​ నుంచి సినిమాలు రాలేదు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఆయన ఆడియన్స్​ను పలకరించబోతున్నారు. ఈ విషయంపై మనోజ్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. 'తిరిగొస్తున్నా. నేను మిస్​ అయిన నా మచ్చాస్ (ఫ్రెండ్స్​)ని కలిసేందుకు, నన్ను మిస్ అయిన చిచ్చాస్ (ఫ్యాన్స్​)ని పలకరించేందుకు రేపు కలుద్దాం. ఇక కసుస్తూనే ఉందాం' అని మంగళవారం ట్వీట్ చేశారు.

వారి బాటలోనే.. అయితే టాలీవుడ్​ హీరోలు షోస్​కి హోస్ట్​లుగా వ్యవహరించడం ఇదేం కొత్తకాదు. ఇదివరకే తెలుగు టాప్​ హీరోలు జూ. ఎన్​టీఆర్ (బిగ్​బాస్ తెలుగు సీజన్ 1, మీలో ఎవరు కోటీశ్వరుడు), నేచురల్ స్టార్ నాని (బిగ్​బాస్ సీజన్ 2), రానా దగ్గుబాటి (No.1 యారి), మెగాస్టార్ చిరంజీవి (మీలో ఎవరు కోటీశ్వరుడు), నాగార్జున అక్కినేని (బిగ్​బాస్ సీజన్ 3 నుంచి), నందమూరి బాలకృష్ణ (అన్​స్టాపబుల్ టాక్ షో) హోస్ట్​లుగా చేశారు.

మంచు మనోజ్​ దంపతులకు గ్రాండ్​ వెల్కమ్​.. వేల మంది ఒకేసారి..

అదిరిన 'మనోజ్​- మౌనిక' మెహందీ వీడియో.. గెస్ట్​లకు 'ఓడ్కా పానీ పూరీ'!

Last Updated : Dec 6, 2023, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.